బాలయ్య మీద అంత బడ్జెటా?

Update: 2019-09-06 04:57 GMT
నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే విదేశీ షెడ్యూల్ పూర్తి చేసుకుని యాక్షన్ ఎపిసోడ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే ఇందులో అల్ట్రా మాడరన్ లుక్స్ లో బాలయ్య ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. టోటల్ గా డిఫరెంట్ మేకోవర్ లో బాలకృష్ణ కనిపిస్తున్న తీరుకి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీని సంగతలా ఉంచితే ఈ సినిమాకు నిర్మాత సి కళ్యాణ్ 30 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు వస్తున్న వార్త షాకింగ్ గా ఉంది.

నిజానికి బాలయ్యకు ఇప్పుడు అంత మార్కెట్ లేదు. అంత పబ్లిసిటీ చేసి హంగామా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ కలిపి పాతిక కోట్లు తేవడానికే నానా పాట్లు పడింది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద ఇంత రిస్క్ చేయడం వెనుక మర్మమేమిటా అనే అనుమానం రాక మానదు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం చూశాకే బోయపాటి శీనుతో భారీ ప్రాజెక్ట్ ని పెండింగ్ లో పెట్టేశాడు. తన మార్కెట్ కున్న పరిమితుల దృష్ట్యా ఎంతవరకు రిస్క్ చేయొచ్చో గుర్తించి ఆపేశాడు.

కానీ సి కళ్యాణ్ ఎందుకు ఇంత మొత్తానికి ఎలా రెడీ అయ్యారో ఆయనకే తెలియాలని ఫిలిం నగర్ టాక్. అసలే కెఎస్ రవికుమార్ దర్శకుడు. జైసింహ ఏదో సంక్రాంతి సీజన్ ను వాడుకుని అలా పాసయ్యింది కానీ ఇప్పటికీ దాన్నేమీ బాలయ్య బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఫ్యాన్స్ పరిగణించరు. అలాంటిది ఏ నమ్మకంతో ఆయన కథతో ఇంత పెట్టుబడి పెట్టడం అన్నది విడుదలయ్యాకే తెలుస్తుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాలయ్య కనిపించునున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి రేస్ లో ఉంటుందా లేదా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి


Tags:    

Similar News