నటసింహంతో రవితేజ సినిమా.. కానీ కుదరలేదు!

Update: 2021-05-29 03:30 GMT
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఒక హీరో కోసం అనుకున్న సినిమా మరో హీరో చేతిలో పడటం మాములే. అయితే ఇలా ఎక్కువసార్లు జరగదు కానీ అప్పుడప్పుడు జరిగినప్పుడే హైలైట్ అవుతుంది. అలా ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన మాస్ రాజా క్రాక్ మూవీ మొదటగా మరో హీరోతో చేయాల్సిందట. కానీ మొత్తానికి అటు ఇటు తిరిగి రవితేజ చేతిలో పడింది. సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ అందరికి మాస్ బిర్యానీలా అదిరిపోయింది అనే చెప్పాలి. అయితే ఈ విషయం తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ పలు విషయాలు బయటపెట్టారు. నిజానికి క్రాక్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే నందమూరి హీరోతో తెరకెక్కించాలని ప్లాన్ చేశారట.

అయితే డైరెక్టర్ గోపీచంద్ మలినేని మొదటగా తమిళ సూపర్ హిట్ మూవీ సేతుపతి ఆధారంగానే క్రాక్ మూవీ కథను సిద్ధం చేసాడట. కానీ అప్పటికే తాను సేతుపతి రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు కళ్యాణ్. తీరా కథను హక్కులు తీసుకున్నాక డైరెక్టర్ గోపీచంద్ కథ విన్నాం. అదికూడా సేతుపతిలాగే అనిపించేసరికి సరే అని అతని దర్శకత్వంలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తీయాలనీ భావించాము. కానీ ఏమైందో గాని వారి కాంబినేషన్ సెట్ అవ్వలేదు. సినిమా ఆఖరికి రవితేజ దగ్గరికి వెళ్ళిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇదే సినిమా చుట్టూ మరో పుకారు కూడా వినిపిస్తుంది. క్రాక్ స్టోరీ ఫస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లిందట.

ఇక కళ్యాణ్ రామ్ బంధువు హరి కొన్ని ఐడియాలను జోడించి ప్రాజెక్టును లైన్ చేశాడట. అప్పుడు కథ ఓ కొలిక్కి రాగానే.. ఓ మలయాళ చిత్రం నుండి మామిడి కాయ, కరెన్సీ నోట్ మేకు లాంటి అంశాలను కథలో మెయిన్ చేశారని టాక్. అయితే అప్పటికే కళ్యాణ్ రామ్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ స్టోరీ రవితేజను చేరిందని పలు కథనాలు చెబుతున్నాయి. మేకర్స్ కూడా మాస్ రాజాతోనే కంటిన్యూ అవ్వడంతో సినిమా పట్టాలెక్కింది. విడుదలైంది ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే క్రాక్ సినిమాను నిర్మాత ఠాగూర్ మధు నిర్మించడం జరిగింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా కరోనా లాక్డౌన్ అనంతరం 50% సీటింగ్ తో రిలీజై హిట్టు అందుకుంది. ఆ విధంగా క్రాక్ సినిమా వెనక విషయాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు మేకర్స్.
Tags:    

Similar News