నోరు జారితే చెప్పు తెగుద్దన్న సి.కల్యాణ్

Update: 2016-08-26 08:09 GMT
గ్యాంగ్ స్టర్ నయింతో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధాలు ఉన్నాయంటూ నిర్మాత నట్టికుమార్ చేసిన ఆరోపణలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై నిర్మాత మండలి మొదలు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నట్టికుమార్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్న వేళ.. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు వివరణ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్మాత సి. కల్యాణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నట్టికుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనపై ఫిర్యాదులు  చేసేందుకు ఏదైనా సెల్ ఓపెన్ చేస్తే కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తాయని.. ప్రతిఒక్కరితోనూ నట్టికుమార్ కు గొడవలేనని మండిపడ్డారు. తనపై నట్టికుమార్ చేసిన ఆరోపణలపై మండిపడ్డ కల్యాణ్.. ‘‘నోరు జారితే చెప్పు తెగుద్ది’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నట్టికుమార్ చేష్టలు భరించలేక అతడ్ని విశాఖపట్నం నుంచి తరిమేసినట్లుగా కల్యాణ్ వ్యాఖ్యానించారు. నయిం ఎవరో తనకు తెలీదని.. నట్టికుమార్ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. నట్టికుమార్ ఒక పిచ్చి కుక్క అని ఫైర్ అయ్యారు.  

నట్టికుమార్ తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాను వివరణ ఇచ్చేందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పిన కల్యాణ్.. క్రీస్తు పేరు చెప్పుకొని నట్టికుమార్ డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపించారు. నట్టికుమార్ చరిత్ర మొత్తం బ్లాక్ మెయిలింగేనని.. నయింకు మాదిరే నట్టికుమార్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. నట్టికుమార్ కు ఉన్న ఒక్క థియేటర్ ఓపెనింగ్ కు తనను అతిధిగా పిలిచాడని.. ‘‘మీరు తప్పక రావాలన్నా’’ అని ప్రాధేయపడటంతో తాను వెళ్లానని.. అలా వెళ్లటాన్ని చిత్రపరిశ్రమకు చెందిన పలువురు తప్పు పట్టారని.. ఎవరితోనూ నట్టికుమార్ కు సత్ సంబంధాలు ఉండవన్నారు.
Tags:    

Similar News