'అఖండ' సినిమాతో అఖండమైన విజయం సాధించిన నటసింహం నందమూరి బాలకృష్ణతో రామానుజాచార్య సినిమా చేస్తానని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ వెల్లడించారు. ఈరోజు గురువారం కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన బ్యానర్ లో రూపొందుతున్న సినిమాల గురించి.. రాబోయే ప్రాజెక్ట్స్ గురించి.. అలానే చిత్ర పరిశ్రమలోని సమస్యలపై స్పందించారు.
* 'గాడ్సే' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. జనవరి 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా చూశాను. మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. నిరుద్యోగం అంటే ఏంటి? అని ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది.
* 'గాడ్సే' దర్శకుడు గోపీ గణేష్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్ తోనూ ఇంకో సినిమా చేస్తాను. 'గాడ్సే' తరువాత సత్యదేవ్ కు చాలా మంచి పేరు వస్తుంది.
* మా బ్యానర్ లో రానా హీరోగా నటించిన '1945' చిత్రాన్ని డిసెంబర్ 31న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకి సంబంధించి వారంలో టీజర్.. రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.
* 'రూలర్' సినిమా అయ్యాక బాలయ్య బాబుతో ఓ సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి
* బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ రామానుజాచార్య సినిమాను తీయాలని ఉంది. ఆయన కూడా చేయాలనుకుంటున్నారు. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్ లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను.
* టిక్కెట్ ధరల్ని తగ్గించి ప్రజలకి మేలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోవచ్చు. మరీ ఇంతగా తగ్గించడం భావ్యం కాదు. టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ సంతోషంగా లేరు. నా వస్తువుని నేను తయారు చేసుకుని, నేనే ధరని నిర్ణయించుకుంటా. ఆ వస్తువుని కొనాలా? వద్దా? సినిమాని చూడాలా వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. టికెట్ ధరల సమస్య పరిష్కారం కోసం పరిశ్రమ తరఫున మేమంతా కలిసి మరోసారి ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నాం.