పలువురు నిర్మాతల ఆఫీసులపై నేడు ఐటీ అధికారులు దాడులు జరపడంతో టాలీవుడ్ లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. కొన్ని నిర్మాణ సంస్థలు టీడీఎస్ ఎగవేతకు పాల్పడుతున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. `జై సింహా` నిర్మాత సీ.కల్యాణ్ `అజ్ఞాతవాసి` నిర్మాత చినబాబు - సురేష్ ప్రొడక్షన్స్ - భవ్య క్రియేషన్స్ - డీవీవీ క్రియేషన్స్ - నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ వంటి 8 నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. 3 సంవత్సరాల నుంచి టీడీఎస్ ఎగవేస్తున్న కొంతమంది నిర్మాతలకు ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సోదాలపై సీ.కళ్యాణ్ స్పందించారు.
తన ఆఫీసులో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన మాట వాస్తవమేనని కల్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో లేనని చెప్పారు. కొత్తి సినిమా విడుదలైన సమయంలో ఈ ఐటీ దాడులు సాధారణమన్నారు. అయితే, కల్యాణ్ కార్యాలయంలో సోదాల అనంతరం ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన `జై సింహా` ఫస్ట్ వీక్ లోనే రూ.25కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్. దీంతో, కల్యాణ్... ట్యాక్స్ సక్రమంగా చెల్లించారా? లేదా? అన్న అంశాలను తెలుసుకునేందుకు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, వి.వి.వినాయక్ - సాయిధరమ్ తేజ్ కాంబోలో భారీ బడ్జెట్ తో కల్యాణ్ తెరకెక్కించబోతోన్న ప్రాజెక్ట్ పైనా ఐటీ అధికారులు కన్నేసినట్లు సమాచారం.