కేలండర్ గాల్స్ అంటూ.. ఓ పోస్టర్ తోనే సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మధుర్ భండార్కర్. మొదట మొహాలు కనిపించకుండా పోస్టర్ ఇచ్చి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన భండార్కర్.. తర్వాత వాళ్లెవరో చెప్పేశాడు. దీంతో ఈ మూవీలోని ఐదుగురు కేలండర్ గాల్స్ తెగ ఫేమస్ అయిపోయారు. ఇందులో హైద్రాబాదీ నందిత మీనన్ కూడా ఉంది. గ్లామర్ ఇండస్ట్రీలో లోటుపాట్లను, నెగిటివ్ అంశాలనే మెయిన్ ప్లాట్ గా తీసుకున్నాడు డైరెక్టర్.
ఈయనకు ఇదేం కొత్త కాదు. గతంలో ప్రియాంకతో ఫ్యాషన్ - తర్వాత కరీనా కపూర్ తో హీరోయిన్ చిత్రాలు ఇలాంటివే. ఇప్పుడు తీసిన కేలండర్ గాల్స్ కూడా అదే తరహా స్టోరీ - నెరేషన్. కష్టాలు - అనుభవాలు. కాకపోతే.. కేలండర్ కారణంగా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు వీళ్లు. అంతే తేడా. ఈ మూవీలో బాగా ఆకట్టుకునే విషయం ఐదుగురు అమ్మాయిలు చిందిన గ్లామర్ మాత్రమే. కేరక్టర్లకి తగ్గట్టుగా ఎక్కడా ఒళ్లుదాచుకునే ప్రయత్నం చేయలేదు ఎవరూ. దీంతో కనువిందుగానే ఉంటాయి దాదాపు అన్ని సీన్స్. అయితే.. డైరెక్టర్ కూడా మనసు పెట్టి తీయలేదని, మధుర్ భండార్కర్ స్టాండర్డ్స్ లేవనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
పాటలు కూడా యావరేజ్ గా ఉండడం మరో మైనస్ పాయింట్ గా నిలిచింది. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాలను నిర్ణయిస్తాయి అంటూ చివరకు కంక్లూడ్ చేయడం కూడా అంత కన్విన్సింగ్ లేదంటున్నారు క్రిటిక్స్. ఇంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక కూడా... ఈ మూవీకి కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు కానీ... ఒకవేళ వస్తే .. అది ఐదుగురి అందచందాల మహిమ మాత్రమే. సినిమాలో స్టఫ్ చూసి కాదనే విషయం అర్ధం చేసుకోవాలి.