ఆంటీ అనే పదాన్ని తెలుగు వాళ్ళు వాడుతున్నంతగా మరెవ్వరూ వాడడం లేదు. పెళ్ళయితే 'ఆంటీ'.. కాస్త పెద్దగా కనిపిస్తే 'అంటీ' అని పిలుస్తారు. ముప్పై ఏళ్ళ ముదురు బెండకాయలు కూడా పెళ్ళైన వాళ్ళను ఆంటి అని పిలుస్తారు. పోనీ ఆ ఆడవాళ్ళకేమైనా వయసు ఓ యాభయ్యో అరవయ్యో అయితే సరలే అనుకోవచ్చు. మరో వైపు ఎవరైనా అమ్మాయిలను ఆంటీ అని పిలిస్తే చాలు.. చాలా ఇబ్బందిగా ఫీలవుతారు.
మరి జబర్దస్త్ బ్యూటీ అనసూయను ఇప్పుడు రంగమ్మత్తా అని పిలుస్తున్నారు. ఈ పిలుపు సరేగానీ ఎవరైనా 'ఆంటీ' అని పిలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? రీసెంట్ గా ఒక లైవ్ ఈవెంట్ లో ఒకతను అనసూయను అంటీ అని పిలిచాడు. అనసూయ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. తన పిల్లల స్నేహితులు ఆంటీ అనే పిలుస్తారు.. సో పెద్దగా ఫీల్ అయ్యేందుకు ఏం లేదని చెప్పింది. అంతే కాదు ఆంటీ గా ఉండేందుకు నేనేమీ ఇబ్బంది పడనని.. వయసు పెరగడాన్ని.. దాంతో వచ్చే మార్పులను గౌరవంగా స్వీకరిస్తానని చెప్పింది. కాకపోతే యాభైల్లో కూడా ఇలాగే కనిపించాలని కోరుకుంటానని చెప్పింది.
నిజంగానే జబర్దస్త్ జవాబిచ్చింది కదా? ఇదిలా ఉంటే 'రంగస్థలం' తర్వాత అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందట. అందులో ఓ మూడిట్లో లీడ్ రోల్ అట. తన తాజా చిత్రం 'కథనం' విడుదల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఏదేమైనా రంగమ్మత్త జోరు మామూలుగా లేదు.