స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంబంధించి.. ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయిందని తెలుస్తోంది. ఇప్పుడు హీరోయిన్ ని ఫైనల్ చేయడంలో మాత్రం దర్శకుడికి తిప్పలు పెరుగుతున్నాయట.
మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా ముకుంద బ్యూటీ పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే బాలీవుడ్ పై కన్నేసిన ఆ భామ నుంచి ఆన్సర్ రాలేదు. డేట్లు సర్దుబాటు చేయలేకపోతున్నా అంటూ నాన్చడంతో మనోళ్ళు ఇంకో భామని చూసుకునే పనిలో పడ్డారు. దానితో రేసుగుర్రం ఫీట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో.. శృతి హాసన్ ని తీసుకుందామని భావించిన హరీష్ శంకర్.. ఇదే్ విషయాన్ని బన్నీకి చేరవేశాడు. అల్లు అర్జున్ కూడా సై అనడంతో.. ఆఫర్ ఆమె దగ్గరకు చేరింది. ఆమె కూడా బన్నీతో జత కట్టేందుకు ఉత్సాహం చూపినా.. డేట్స్ విషయంలో క్లారిటీ తెచ్చుకుని ఫైనల్ చేస్తానని చెప్పింది.
ప్రస్తుతం సింగం3 చేస్తున్న శృతి.. తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు కూడా పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కూడా డేట్స్ ఇచ్చేసింది అమ్మడు. దీంతో బన్నీ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని భావించిన శృతి.. అదే విషయాన్ని తేల్చేసిందట. అందుకే ఇప్పడు బన్నీ కోసం మరో హీరోయిన్ కోసం వెతుకులాడాల్సి వస్తోందని టాక్.