ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జెమ్స్ కామెరూన్ అసాధారణ చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఖ్యాతికెక్కారు. 'టైటానిక్'.. టెర్మినేటర్.. 'అవతార్' లాంటి కళాఖండాలు కామెరూన్ అసాధారణ ప్రతిభని తెలియజేస్తున్నాయి. వాటి వెనుక ఎంతో కృషి ఉంది. ముఖ్యంగా అవతార్ లాంటి విజువల్ వండర్ గురించి చెప్పాల్సి వస్తే! ఇలాంటి సినిమా చేయడం కేవలం ఆయనకు మాత్రమే చెల్లింది.
ప్రపంచంలో ఎంతో మంది సృజనాత్మకత గల దర్శకులున్నా? వాళ్లెవరికి సాధ్యం కానిది కామెరూన్ సాధ్యం చేసి చూపించారు. ఈ సినిమా ఆయన స్థాయిని మరింత పెంచింది. ప్రస్తుతం అవతార్ ప్రాంచైజీ నుంచి మరిన్ని చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఈ డిసెంబర్ లో అవతార్ -2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అవతార్ సృష్టికి ఆయనెంతగా శ్రమించాల్సి వచ్చిందన్నది రివీల్ చేసారు.
'అవతార్ లో కొన్ని సన్నివేశాలు తొలగించకుండా..నిడివి తగ్గకుండా నిర్మాతలో పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చిందన్నారు. అవతార్ షూటింగ్ సమయంలో నిర్మాతలతో చాలా సార్లు గొడవ పడ్డాను. మనసుకు ఏది నచ్చితే అది చేయడానికి ఫాక్స్ స్టూడియోస్ ఒప్పుకునేది కాదు. రకరకాల కండీషన్లు ..ఒత్తిళ్లు ఉండేవి. చిత్రం నిడివి తగ్గించాలి.
ఇక్రాన్ పాత్ర ఎగిరే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని కత్తిరించాలని నిర్మాతలు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కామెరూన్ కోప్పడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుంటోన్నీ బంగళా..4 వేల కోట్ల విలువైన స్టూడియో కాంప్లెక్స్ ఇక్కడున్నాయంటే దానికి కారణం నేను మీకోసం తెరకెక్కించిన 'టైటానిక్' అన్న విషయాన్ని మార్చిపోయారా? అని నిర్మాతల్ని హెచ్చరించారుట.
ఆ విషయం నెమ్మదిగా అర్ధం చేసుకున్న పాక్స్ స్టార్ స్టూడియోస్ అధినేతలు తర్వాత ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా అవతార్ ని పూర్తిచేయడానికి పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు. మొత్తానికి అవతార్ కోసం కామెరూన్ పెద్ద యుద్దమే చేసారని తెలుస్తోంది. అవతార్ ప్రపంచ వ్యాప్తంగా 16 వేల కోట్ల వసూళ్లని సాధించింది.
'అవెంజెర్స్ ఎండ్ గేమ్' వచ్చేంత వరకూ ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అవతార్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు అవెంజెర్స్ చరిత్ర తిరగరాయడానికి అవతార్ 2 రెడీ అవుతోంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ లో సినిమా రిలీజ్ అవుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కకించగా.. అన్ని పనులు పూర్తిచేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.