వివాదాస్పద అంశాలతో విడుదల ఇబ్బందుల్లో చిక్కుకున్న పద్మావతి చిత్రానికి సంబంధించి తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. పద్మావతి చిత్రంపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై బాంబే హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇలాంటివి మరే దేశంలో అయినా జరుగుతాయా? అని సూటిగా ప్రశ్నించింది.
ఏ దేశంలో అయినా కళాకారుల్ని చంపేస్తామంటూ బెదిరిస్తారా? అంటూ ప్రశ్నించిన హైకోర్టు పద్మావతి చిత్ర విడుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మరే దేశంలో అయినా ఇలా కళాకారుల్ని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారా? సినిమాను తీయటానికి ఎంతో మంది కష్టపడాల్సి ఉంటుందని.. అలాంటిది సినిమా తీశాక బెదిరంపులకు కారణంగా విడుదల కాకపోవటం చాలా బాధాకరమని వ్యాఖ్యానించింది.
"ఈ దేశంలో ఒక సినిమాను విడుదల కానివ్వటం లేదు. అసలు మనం ఏ స్థితికి చేరుకున్నాం? కళాకారుల తల నరికి తెస్తే రివార్డులు ఇస్తామని ప్రకటిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వారితో సమానంగా ఆందోళనలు చేస్తూ సినిమాను నిషేధించారు. ఇది మరో రకమైన సెన్సార్ షిప్. పేరు.. డబ్బున్న వారికే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు పేదల సంగతి ఏమిటి?" అంటూ బాంబే హైకోర్టు న్యాయమూర్తులు భారతి డాంగ్రే.. ధర్మాధికారిలు ప్రశ్నించారు.