సాహో ట్రైలర్ తో పాటు చాప్టర్ 1-2 మేకింగ్ వీడియోల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆకర్షించాయి. అయితే పర్టిక్యులర్ గా ఆ చిత్రంలో ఛేజింగ్ సన్నివేశాల్లో ఓ సూపర్ (స్పోర్ట్స్) కార్ విశేషంగా ఆకట్టుకుంది. దాంతో పాటే ఒక ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కూడా ఆకట్టుకుంది. వాటిని ప్రభాస్ డ్రైవ్ చేసిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చింది. ఇంతకీ ఆ కార్ ఎవరిది? ఆ బైక్ ఎవరిది? అంటే డార్లింగ్ ప్రభాస్ సొంత కార్ .. బైక్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అవి రెండూ ప్రభాస్ హైదరాబాద్ ఇంట్లో గ్యారేజ్ లో బంధీగా ఉన్నాయట.
ప్రస్తుతం ప్రచారం పరంగా వేగం పెంచారు కాబట్టి.. వీటిని సాహో ప్రచారం కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇంతకీ ఆ కార్ ప్రత్యేకత ఏమిటి..? అంటే .. దాని ఖరీదు 1.5కోట్లు. హుయారా అనే ఇటాలియన్ స్పోర్ట్స్ బ్రాండ్ కార్ అది. దానిని యాక్షన్ సీన్స్ కోసం అవసరం మేర పూర్తిగా రీమోడల్ చేశారు. ఆ కార్ ని రీడిజైన్ చేశాక చాలా వరకూ లుక్ అల్ట్రా మోడ్రన్ గా తయారైంది. దుబాయ్ కి చెందిన పగాని ఆటోమొబైల్ కంపెనీకి చెందిన డిజైనర్ దీనిని రూపొందించారట. ఆ కార్ లుక్ మార్చేయడమే కాదు.. కాక్ పిట్ లో ప్రత్యేకించి కొన్ని లైట్లు కెమెరాల్ని సెట్ చేశారట. అలాగే ఈ కార్ ని ఎలా నడిపించాలి? అనే దానికోసం ప్రభాస్ ప్రత్యేకించి క్లాసులకు ఎటెండయ్యారని తెలుస్తోంది.
అంతేకాదు దుబాయ్ వీధుల్లో రయ్ రయ్ మని సౌండ్ చేస్తూ దూసుకెళ్లింది ఈ కార్ నే. భారీ యాక్షన్ సన్నివేశాలకు దీనిని ఉపయోగించారు. అబూదబీలో తెరకెక్కించిన ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది. దీనికోసం ఎనిమిది నెలల ప్రిపరేషన్ చేసి వంద కోట్ల బడ్జెట్ పెట్టారని ఇప్పటికే ప్రచారమైంది. ప్రమోషన్స్ కి ఈ కార్ ని ఉపయోగిస్తే ఆ మేరకు ఫ్యాన్స్ లో క్రేజు ఇంకా పెరుగుతుందనడంలో సందేహమేం లేదు.