డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి కోసం ఒక్కో సినిమాకి వందల కోట్ల పెట్టుబడులు వెదజల్లేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న వాటిలో నువ్వా నేనా? అంటూ ఒకదానిని మించి ఒకటి సెట్స్ పై ఉన్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ కావాల్సి ఉంది. ఓం రౌత్- ఆదిపురుష్ 3డి.. ప్రశాంత్ నీల్- సలార్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయి రిలీజ్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసేందుకు ఏడాది పైగానే పడుతుందని అంచనా ఉంది. ఆ సినిమా ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
ఇంత భారీ షెడ్యూల్ నడుమ ప్రభాస్ అటు బాలీవుడ్ లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాలొస్తున్నాయి. వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్రభాస్ సంతకం చేశారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. అలాగే యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4 కోసం ప్రభాస్ ని సంప్రదించిందని కూడా కథనాలొచ్చాయి.
ఇంత భారీ షెడ్యూళ్ల నడుమ ప్రభాస్ తిరిగి టాలీవుడ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దర్శకులకు ఓకే చెబుతారా? అంటూ చర్చ వేడెక్కిస్తోంది. అయితే ప్రభాస్ తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బృందం ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఈ మూవీకి ప్రభాస్ సంతకం చేయాలంటే తదుపరి క్యూలైన్ లో ఉన్న నాలుగు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యేందుకు రెండేళ్లు పైగానే పడుతుందని అంచనా. ఆ తర్వాతే హారిక సంస్థతో సినిమా చేసే వీలుంటుంది.
ఒకవేళ ప్రభాస్ తో సినిమా చేసినా కానీ అది యూనివర్శల్ కాన్సెప్ట్ అయ్యుండాలి. అతడి పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మాయావి ఓ డిఫరెంట్ నేరేషన్ తో ఇన్సెప్షన్ లాంటి సినిమా తీయాల్సి ఉంటుందేమో! అన్న గుసగుసలు స్ప్రెడ్ అవుతున్నాయి.