2067 ఎలా ఉంటుందో తెలుసా?

Update: 2017-07-28 05:15 GMT
ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది చాలా రకాల కరువుల తో సతమతం అవుతున్నారు. కొందరికి దున్నుకోవడానికి భూమి ఉండదు , చదువు కోవడానికి స్కూల్లు ఉండవు,  తాగడానికి సరైన మంచి నీళ్ళు దొరకవు.. జబ్బు చేస్తే హాస్పిటల్స్ ఉండవు. ఇవన్నీ ఆర్ధిక సమాజానికి సంబంధించిన సమస్యలు. కొన్ని ప్రకృతికి సంబందించిన కరువులు కూడా ముందు ముందు రావచ్చు. ఇప్పుడు అలా ఏవి  రాబోతున్నాయో చెప్పడానికి  ఒక షార్ట్ ఫిల్మ్ విడుదల కాబోతుంది.

అది 2067 సంవత్సరం అక్కడ బతుకుతున్న మనుషులు ఆక్సిజన్ దొరకక ఒకరిని ఒకరుని చంపుకుంటున్నారు. ఆక్సిజన్ పాకెట్ రూపంలో మనం కొనుక్కోవలిసి ఉంటుంది. టూత్ పేస్ట్ - షాంపూ లు ఎలా కొంటున్నామో అలానే ఆక్సిజన్ కొనవలిసి వస్తుంది అని మొదలుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఒక మాట ఉంది దానితో  సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ”2067 వచ్చేపటికి ఆక్సిజన్ తయారు చేసే కంపెనీలు కూడా ఉంటాయి. కోట్ల వ్యాపారం జరుగుతుంది ఆక్సిజన్ పైన. ఇప్పుడు ఫ్రీ గా ఏదైనా దొరుకుతుంది అంటే అది కేవలం కార్బన్ మాత్రమే'' అనే మెసేజ్ చెప్పారు. ఆక్సిజన్ కోసం కిడ్నాప్ లు కూడా జరుగుతున్నాయంటూ.. మనుషులు మాస్క్ లు వేసుకొని బతుకుతున్నారు అంటూ.. అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో ఈ షార్ట్ ఫిల్ ద్వారా చెప్పబోతున్నారు.

బాలీవుడ్‌ నటులు జాకీ భగ్నానీ - నవాజుద్దీన్‌ సిద్ధిఖి - ప్రాచీ దేశాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిన్న సినిమా పేరు  ‘కార్బన్‌’. ‘ఎ స్టోరీ ఆఫ్‌ టుమారో’ అనేది  టాగ్ లైన్.  ఇప్పటికే కొంత మంది స్టార్లు, యూట్యూబ్ వీక్షకులు ఈ ట్రైలర్ చూసి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అని వాళ్ళ ఉత్కంఠ తెలిజేస్తున్నారు. తొందరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నాము అని తెలిపారు ఆ చిత్ర యూనిట్.

Full View
Tags:    

Similar News