గుంటూరు టాకీస్ అంటూ బోల్డ్ మూవీని తెలుగు తెరపైకి తెచ్చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది, గతంలో జాతీయ అవార్డు కూడా పొందిన ఈ డైరెక్టర్ పేరు.. కొత్త సినిమా గుంటూరు టాకీస్ విడుదలయినప్పటి నుంచి మాత్రం.. నెగిటివ్ వార్తల మధ్యే వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాపై తెలంగాణ వికలాంగుల హక్కుల గ్రూప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు టాకీస్ సినిమాలో శారీరక లోపాలు ఉన్న వారి మనోభావాలు దెబ్బతీశారంటూ.. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు కంప్లెయింట్ అందింది. ఈ సినిమాలో కొన్ని డైలాగులను వికలాంగులకు వ్యతిరేకంగా రాశారని కంప్లెయింట్ వివరించారు. పీడబ్ల్యూసీ యాక్ట్ 1995 ప్రకారం గుంటూరు టాకీస్ చిత్ర దర్శకుడు - నిర్మాతలపై కేసు నమోదు చేయాలని వారు కోరారు. మరోవైపు ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ చాలామంది అంటున్నారు. సినిమాలో కంటెంట్ సాధారణంగానే ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తుండడం విశేషం.
సీనియర్ యాక్టర్ నరేష్ పెర్ఫామెన్స్, రేష్మీ గౌతం విచ్చలవిడి అందాల ప్రదర్శన, శ్రద్ధా దాస్ చేసిన బోల్డ్ యాక్షన్.. సినిమాని నిలబెట్టేశాయి. కలెక్షన్ల పరంగా ఎలాంటి లోటు లేకపోయినా.. రిజల్ట్ బాగానే ఉన్నా. దర్శక నిర్మాతలకు వివాదాలు మాత్రం వెంటాడుతున్నాయి.