ఇప్పటికే బోలెడన్ని నష్టాలతో కిందా మీదా పడుతున్న రియాల్టీ షోకు సంబంధించి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. పెళ్లి చూపులు కార్యక్రమం పేరుతో ఒక ఛానల్ లో నిర్వహిస్తున్న షోపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్పీ రేటింగ్ లు కూడా పెద్దగా లేవన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఈ షో నడిపిస్తున్న తీరుపై రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన దీక్షను నిర్వహించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కర్నూలు కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు.. ఈ షో ద్వారా ఆడవాళ్లను అంగడి సరుకును చేస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖంగా కనిపిస్తున్న యాంకర్లు ప్రదీప్.. సుమల తీరును తప్పు పడుతున్నారు.
పెళ్లి చూపుల పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం ఏ మాత్రం బాగోలేదని.. మహిళల మనోభావాలు దెబ్బ తినేలా ఈ కార్యక్రమం ఉన్నట్లు మండిపడుతున్నారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి దాకా సోషల్ మీడియాలో విమర్శలు.. ఎటకారపు పంచ్ ల స్థాయి దాటిపోయి.. పలువురు మహిళలు నిరసన పేరుతో రోడ్ల మీదకు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.