RRR: బిహైండ్ అండ్ బియాండ్.. దక్కని ఆధరణ

డాక్యుమెంటరీకి మంచి స్పందన దక్కడం ఖాయం అని ప్రతి ఒక్కరు భావించారు.

Update: 2024-12-24 20:30 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది. అత్యధిక వసూళ్లు సొంతం చేసుకుని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆ సమయంలో నెం.3 స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. రామ్ చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ను కొమురం భీమ్‌ పాత్రలో చూపించారు. సినిమాకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ దక్కడం మరో విశేషం. సినిమా ఎలా మొదలైంది, ఎలా సాంగిది, ఆస్కార్‌ అవార్డు వరకు వెళ్లింది అనే విషయాలను తెలియజేస్తూ రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ : బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. డాక్యుమెంటరీకి మంచి స్పందన దక్కడం ఖాయం అని ప్రతి ఒక్కరు భావించారు.

సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఆ విషయాలను దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు, ఇతర యూనిట్‌ సభ్యులు అంతా మాట్లాడటంతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాలకు సంబంధించిన ఆన్ లొకేషన్‌ వర్క్‌, మేకింగ్‌ వీడియోలను డాక్యుమెంటరీలో పొందు పరచడం తెల్సిందే. థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల అయినప్పటి నుంచి ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. థియేటర్‌లో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేసిన రాజమౌళి అండ్ టీం, చాలా తక్కువ సంఖ్య థియేటర్ లో మాత్రమే విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మేకింగ్ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్‌ రన్‌లో ఈ డాక్యుమెంటరీకి పెద్దగా ఆధరణ దక్కడం లేదు. థియేటర్‌లలో పెద్ద సినిమాలు లేకున్నా దీనికి పెద్దగా ఆధరణ దక్కక పోవడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా కూడా థియేటర్ల వద్ద సందడి చేయలేదు. ప్రస్తుతం సంధ్య థియేటర్‌ ఇష్యూ జరుగుతున్న కారణంగా ఏమైనా ఈ డాక్యుమెంటరీకి ఆధరణ దక్కడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటీటీలో వచ్చే ఈ డాక్యుమెంటరీని స్పెషల్‌గా వెండి తెర మీద చూడడానికి ఏముంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27న ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కాబోతుంది. స్ట్రీమింగ్‌కి వారం కూడా లేని డాక్యుమెంటరీని ఎందుకు థియేటర్‌కి వెళ్లి అంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది అనే అభిప్రాయంతో ప్రేక్షకులు ఉన్నారు. థియేటర్‌ రిలీజ్ అనేది తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తుంటే, కొందరు మాత్రం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ కావాలి అనుకున్న వారు ఈ డాక్యుమెంటరీని బిగ్‌ స్క్రీన్‌ పై చూస్తున్నారు. థియేటర్‌లో పెద్దగా ఆధరణ దక్కకున్నా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ మొదలు అయిన తర్వాత కచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News