పొగరు సినిమా గర్తుందా? అదేనండి.. విశాల్.. శ్రేయ జంటగా నటించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తాడే.. అతగాడి పేరు వినాయకన్. మలయాళ చిత్రపరిశ్రమలో సుపరిచితుడైన ఆ నటుడికి మరో యాంగిల్ ఉంది. అది దళిత కార్యకర్త. గతంలో మహిళా నటిని వేధింపులకు గురి చేసిన ఉదంతంలో తీవ్రంగా రియాక్ట్ అయి.. ఆమె చేసే ఉద్యమానికి మద్దతు పలికి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అలాంటి వినాయగన్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. సామాజిక కార్యకర్త మృదులాదేవి శశిధరణ్ తాజాగా నటుడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అంతేకాదు.. అతడు తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వాయనాడ్ జిల్లాలోని కాల్ పేట్టా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు.. తనతో వినాయగన్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో రికార్డును తన కంప్లైంట్ తో పాటు జత చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
మహిళా నటిని వేధింపులకు గురి చేసిన విషయంలో రియాక్ట్ అయిన వినాయకన్ తీరు తన దృష్టిని ఆకర్షించినట్లుగా మృదులాదేవి పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించాలనుకొని ఫోన్ చేస్తే.. మిగిలిన మగాళ్ల మాదిరి ప్రవర్తించారని మండిపడ్డారు.
తనతో చాలా అమర్యాదకరంగా.. అసహ్యకరంగా.. అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆమె చెప్పారు. తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా ఫోన్లో మాట్లాడారన్నారు. తనతో పాటు.. తన తల్లి కూడా అతడి కోరికను తీర్చాలని అన్నట్లుగా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్ తన దగ్గర ఉందన్న ఆమె.. తన కంప్లైంట్ కు దాన్ని జత చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తొలుత తనకు జరిగిన అన్యాయాన్ని ఫేస్ బుక్ పోస్ట్ రూపంలో పెట్టారు మృదులాదేవి. అయితే..కొందరు నెటిజన్లు.. ఆమె ఆరోపణలు నిజం కావని.. అబద్ధమని పేర్కొనటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన దగ్గర సాక్ష్యంగా ఉన్న క్లిప్పను అందజేశారు. మరి.. దీనిపై సదరు నటుడి రియాక్షన్ ఏమిటో చూడాలి.