వీడియో టాక్: ఏ ఫర్ 'సెక్సీ' యాపిల్

Update: 2017-08-01 04:59 GMT
మామూలుగా అయితే ఏ ఫర్ యాపిల్ అనే చెప్పాలి.. కాని ఇక్కడ మాత్రం ఒక సెక్సీ యాపిల్ వన్నె చిన్నది ఆ విషయం చెబుతుంటే మాత్రం.. కఛ్చితంగా పదాలు తారుమారయ్యా చాన్సుంది. అదిగో ఆమె అడుగులు వేస్తుంటే మన గుండె జారుతోంది. ఆమె చిందులు వేస్తుంటే మన హృదయం కూడా నాట్యం చేస్తోంది. ఇంతకీ దుబాయ్ నుండి వచ్చిన మలయాళ ముద్దుగుమ్మ ఏం చేస్తోందో చూడండి.

గతంలో 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యేను చేసిన సెకండ్ హీరోయిన్ క్యారక్టర్లు చేసుకోమంటూ లైఫ్‌ ఇచ్చిన బోయపాటి శ్రీను.. ఇప్పుడు కూడా క్యాథరీన్ త్రెసా అలెగ్జాండర్ కు తన సినిమాలో మరో రోల్ ఇచ్చాడు. ఈసారి ఆమెను ఐటెం  బాంబ్ చేసేశాడు. ఏదో ఇతర సినిమాల్లో నాలుగు సీన్లో కలిపి ఒక హాట్ సాంగ్ ఉంటే.. ఇక్కడ అటువంటి సీన్లు లేకుండా డైరక్టుగా ఒక హాటు సాంగులోకి దించేశారంతే. మిగిలినదంతా సేమ్ టు సేమ్. గ్లామర్ కు కొత్త నిర్వచనం ఇస్తాను అంటూ ఈ మధ్యన తెగ చెబుతున్న క్యాథరీన్ ఇప్పుడు నిజంగానే తన సోకులతో వెండితెరను పావనం చేస్తోంది.

ఈ మద్యనే గౌతమ్ నంద సినిమాలో బికినీలో కూడా మెరిసిన క్యాథరీన్.. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ కు దగ్గరగా కనిపిస్తూ తనలోని ఐటెం భామ హొయలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతోంది. కాకపోతే ఈ పాట వినడానికి మాత్రం దేవిశ్రీప్రసాద్ గతంలో కొట్టిన ఐటెం సాంగుల తరహాలో పెద్దగా క్యాచీగా లేదనే చెప్పాలి.

Full View

Tags:    

Similar News