టాప్ సెలబ్రిటీస్ ఈ మధ్య ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇక్కడ ఆనందించదగ్గ విషయం ఏంటంటే దీని బారిన పడిన చాలా మంది ధైర్యంగా ముందడువేసి క్యాన్పసర్ తో పోరాడి సేఫ్‌గా బయటపడుతున్న వారే ఎక్కువ. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్.. బాలీవుడ్ .. అనే తేడా లేకుండా ఆల్ ఇండస్ట్రీకి చెందిన క్రేజీ తారలు క్యాన్సర్ బారిన పడటం సినీ ప్రియుల్ని కలచివేసింది. అందులో అత్యధికంగా పాపులర్ హీరోయిన్ లే వుండటం గమనార్హం.
క్యాన్సర్ బారిన పడి మొక్కవోని విశ్వాసంతో పోరాడి విజేతలుగా నిలిచి సెకండ్ లైఫ్ ని స్టార్ట్ చేసిన వారు ఎంతో మంది వున్నారు. వారి గురించి ఓ సారి తెలుసుకుందాం. ఇంతకీ ఎంత మంది తారలు క్యాన్సర్ బారిన పడ్డారు. ఎలా విజేతలుగా నిలిచారు అన్నది ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తోంది.
తాజాగా టాలీవుడ్ హీరోయిన్, అత్తారింటికి దారేది, మిర్చి, పంతం వంటి తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం తనకు కీమో థెరపీ జరుగుతోందని దాని కారణంగా జుట్టంతా రాలిపోయిందని తెలుపుతూ గుండుతో వున్న ఓ ఫొటోని షేర్ చేయడం పలువురు సినీ ప్రియుల్ని భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది.
ఇదే తరహాలో `మన్మథుడు`, ఇంద్ర, ఖడ్గం వంటి తదితర బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగులో మంచి క్రేజ్ తో పాటు ఫ్యాన్ పాలోయింగ్ ని సొంతం చేసుకున్న సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోనాలి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ లు అభిమానుల హృదయాన్ని కదిలించాయి.
కీమో థెరపీ తరువాత కోలుకుని క్యాన్సర్ ని జయించిన సోనాలి బింద్రే ప్రస్తుతం తనలా క్యాన్సర్ బారిన పడి బాధపడుతున్న వారికి అండగా నిలిచి ధైర్యాన్నిస్తోంది.
మహేష్ బాబు నటించిన `టక్కరి దొంగ` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన లీసారే కూడా క్యాన్సర్ బారిన పడింది. పదేళ్ల క్రితం ఈ వ్యాధి సోకిందని తెలిపిన లీసారే కొంత కాలం ప్లాస్మా సెల్ లో ఏర్పడే మల్టీపుల్ మైలోమా అనే క్యాన్సర్ తో బాధపడింది. దాదాపు ఏడాదికి పైగా చికిత్స పొందుతూ క్యాన్సర్‌పై పోరాడి విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతోంది.
తెలుగులో బొంబాయి, క్రిమినల్, ఒకే ఒక్కడు, భారతీయుడు వంటి చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది మనీషా కోయిరాలా. నేపాలీ నటిగా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ .. ఆ తరువాత దక్షిణాది చిత్రాల్లో మెరిసింది. కెరీర్ కొంత ఇబ్బందికరంగా మారుతున్న సమయంలో ఆమెని క్యాన్సర్ ఆడుకుంది.
2012లో ఒవరియన్ అనే క్యాన్సర్‌తో బాధపడిన మనీషా దాని నుంచికోలుకుని క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తూ వారిలో అవగాహన కల్పిస్తున్నారు.
ఇక `యమ దొంగ` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటి మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ తో పోరాడారు. 2010లో ఆమెకు క్యాన్సర్ సోకింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సినిమాలకు దూరమైన మమత క్యాన్సర్‌ని జయించి 2015 లో తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సమయంలో కమల్ తో కలిసి జీవిస్తున్న ఆమె తన నుంచి విడిపోయి క్యాన్సర్ ని జయించింది. ప్రస్తుతం తనలా క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారామె. వీరితో పాటు బాలీవుడ్ దర్‌శకుడు అనురాగ్ బసు, క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారినపడి పోరాడి గెలిచారు.