తన సినిమాలతో ఎన్నో అద్భుతాలు చేసి సూపర్ స్టార్ గా అశేష ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేసింది. కృష్ణ ఆకస్మిక మృతి పరిశ్రమలో విషాద చాయలు అలముకునేలా చేసింది. నటశేఖరుడికి ఘన నివాళి ఇచ్చేందుకు పరిశ్రమ కదలి వస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ బౌతికకాయానికి నివాళి అర్పించేందుకు సినీ ప్రముఖులు నానక్ రామ్ గూడ కృష్ణ నివాసానికి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ తో పాటుగా మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్ కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు. అంతకుముందే తెలంగాణా ప్రభుత్వం అధికార లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారని ప్రకటించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఎన్.టి.ఆర్, వెంకటేష్, చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ తదితరులు వచ్చి కృష్ణని చివరిసారిగా చూశారు. ఇక కృష్ణ గారి మరణ వార్త తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ వేదికగా కృష్ణ గారికి నివాళి ప్రకటించారు.
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో ఉన్నతమైన స్నేహ పూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.. ఈ విషాద సమయంలో మహేష్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్త దిగ్బ్రాంతికి గురి చేసిందని. ఆయన క్రమశిక్షణ.. పనితీరు ఉదహరణగా నిలుస్తాయని.. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయ పూర్వక సానుభూతి తెలియచేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.