ప‌వ‌ర్ స్టార్ పై సెల‌బ్రిటీల ట్వీట్ ల వ‌ర్షం!

Update: 2022-09-02 07:32 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు స్టార్ హీరోలు, కుటుంబ స‌భ్యులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ట్వీట్ ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పుట్టిన రోజు శుభ‌కాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేస్తున్నారు. వ‌వ‌న్ తో క‌లిసి దిగిన ఫొటోల‌ని ఈ సంద‌ర్భంగా షేర్ చేస్తూ ప‌వ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా #HBDPawanKalyan, #HBDJanaSenani అనే హ్యాష్ ట్యాగ్ లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. `తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. Happy Birthday @PawanKalyan` అంటూ మెగాస్టార్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌హేష్ బాబు ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. `పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మీకు ఎల్ల‌ప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందం మ‌రియు సంతృప్తి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను` అని ట్వీట్ చేశారు.

ఇక మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న‌దైన శైలిలో ప‌వ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌వ‌ర్ నే ఇంటి పేరుగా మార్చుకున్నా నా గుడ్ ఫ్రెండ్ ప‌వన్ క‌ల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మంచి ఆరోగ్యం.. ఆనందం, సంతృప్తి ఎల్ల‌ప్పుడూ వుండాల‌ని కోరుకున్నారు. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు `మ‌న‌ల్ని ఎవ‌డ్రా ఆపేది` అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్ ని విడుద‌ల చేశారు.

అంతే కాకుండా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ తో క‌లిసి వున్న ఫొటోని పంచుకున్న నాగ‌బాబు దానికి అంద‌మైన అక్ష‌రాల‌ని జోడించారు. `ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో అద్భుతంగా జరుపుకోవాలి అని జరుపుకుంటాడని, జనసైనికులు, వీర మహిళ‌లు, అభిమానులు, అందరు జరుపుకుంటారని ఆశిస్తూ...నిన్ను మనస్ఫూర్తిగా బ్లేస్ చేస్తూ మీ అన్నయ్య, జనసైనికుడు, నాగబాబు` అని ట్వీట్ చేశారు.

మా గురువు దైవం, ప‌వ‌న్ క‌ల్యాణ్ మామ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఆయురారోగ్యాల‌తో ప్రతీ రంగంలోనూ మీరు విజ‌యాలు అందుకోవాల‌ని ప్రార్థిస్తున్నా అంటూ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశారు. మంచిత‌నం, మాన‌వ‌త్వం, స‌త్యం, ధ‌ర్మం, విలువ‌లు.. వీటిని మించిన హీరోయిజమ్ లేద‌ని ఆచ‌ర‌ణ‌లో పాటిస్తూ అనుస‌ర‌ణ‌ఫీయ మార్గాన్ని చూపిస్తూ సాగిపోతున్న క‌ర్మ‌యోగి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని రామ‌జోగ‌య్య శాస్త్రి ట్వీట్ చేశారు.

మంచి త‌న‌నానికి మారుపేరు..మంచి మ‌న‌సుకి నిర్వ‌చ‌నం..అంద‌రూ బాగుండాల‌నే వ్య‌క్తిత్వం క‌ల‌బోస్తే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు` అని ప‌రుచూరి గోపాల‌కృష్ణ ట్వీట్ చేశారు. బండ్ల‌న్న బండ్ల గ‌ణేష్ త‌న‌దైన స్టైల్లో స్పందించి ప‌వ‌న్ పై వున్న ప్రేమ‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. ఈ విశ్వంలో సూర్యుడు ఒక్క‌డే.. చంద్రుడు ఒక్క‌డే.. ప‌వ‌న్ ఈశ్వ‌రుడు ఒక్క‌డే..మా దేవ‌ర‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశాడు. బీవీఎస్ ర‌వి, అల్ల‌రి న‌రేష్‌, హీరో నాగ‌శౌర్య‌, ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల‌, మంచు మ‌నోజ్‌, న‌వ‌దీప్‌, త‌మ‌న్‌, ఎస్ వీసీ, బ్ర‌హ్మాజీ, నిర్మాత నాగ‌వంశీ త‌దిత‌రులు ప‌వ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ త‌దిత‌ర హీరోల నుంచి ఎలాంటి ట్వీట్స్ క‌నిపించ‌లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News