ప్రాణాలను కబలించే వ్యాధి మనకు సోకినప్పుడు ఏం చేస్తాం.. ‘వామ్మో.. వాయ్యో అంటూ’ ప్రాణాల మీద ఆశ వదిలేస్తాం.. చివరి చూపుల కోసం బంధువులందరినీ పిలుపించుకొని టాటా - గుడ్ బై అంటూ కన్నీళ్లు కారుస్తాం. కానీ వీళ్లు మాత్రం అలా కృంగి పోలేదు..
క్యాన్సర్.. పూర్వకాలంలో దీన్ని ‘రాచపుండు’ అని పిలిచేవారు.. ఇది గొప్ప గొప్పవాళ్లకే వచ్చే వ్యాధి అని దానికా పేరు పెట్టారు. కాలక్రమేణా అందిరికీ వస్తూ ఆ పేరును పోగొట్టుకుంది. కానీ ఈ మహమ్మారి ఆది నుంచి సినీ రంగాన్ని కుదిపేస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో పలువురు సినీ తారలు ఈ వ్యాధి బారిన పడిన ఉదంతాలు - ధీటుగా ఎదుర్కొని విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా క్యాన్సర్ బారిన పడగానే బాలీవుడ్ అందాల హీరోయిన్ సోనాలి బింద్రే కృంగిపోలేదు. ‘సర్వశక్తులతో పోరాడాల్సిన టైం వచ్చింది. ఈ వ్యాధిని ఎదుర్కొంటా’ అంటూ ట్వీట్ చేసి అమెరికాలో చికిత్స చేయించుకోవడానికి తరలివెళ్లింది.
బాలీవుడ్ అగ్ర తారలు నర్గీస్ దత్ - రాజేశ్ ఖన్నా - ముంతాజ్ లు కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ వ్యాధితో పోరాడుతూ చనిపోయారు. ఇక తెలుగులో నటించిన సినీ ప్రముఖులకు కూడా క్యాన్సర్ సోకింది. వారి గురించి తెలుసుకుందాం..
* మనీషా కొయిరాలా : బొంబాయి - భారతీయుడు - ఒకే ఒక్కడు లాంటి 90ల నాటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల కలలరాణిగా ఎదిగిన మనీషా కొయిరాలకు ఓవెరీన్ క్యాన్సర్ సోకింది. మృత్యుముఖం దాకా వెళ్లి మూడేళ్ల పోరాటం తర్వాత కోలుకుంది. అమెరికాలో చికిత్స చేయించుకున్న ఈ నటి 47 వయసులో ప్రస్తుతం క్యాన్సర్ ను జయించింది. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టింది.
* గౌతమి: దక్షిణాది హీరోయిన్ గౌతమి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ను జయించి పోరాడే వారికి అవసరమైన మద్దతును ఇస్తున్నారు. దేశ విదేశాల్లో ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చుట్టుపక్కల వారి మద్దతు ఉంటే క్యాన్సర్ ను జయించవచ్చని గౌతమి చెబుతోంది..
*మమతా మోహన్ దాస్: హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్నప్పుడే మమతా మోహన్ దాస్ కు క్యాన్సర్ సోకింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు హాడ్గికిన్ లింఫోమా క్యానర్ అని గుర్తించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఆ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడింది. ప్రస్తుతం తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు..
* ఇర్ఫాన్ ఖాన్ : బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు క్యాన్సర్ సోకిందని తెలిసి మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. మార్చి 16న తనకు న్యూరాన్ డొక్రైమ్ ట్యూమర్ ఉన్నట్టు ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నాడు. క్యాన్సర్ ను జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు..
*తాజాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కూడా మూడు నెలలు సెలవుపెట్టి అమెరికాలో పాంక్రియాస్ క్యాన్సర్ కు చికిత్స చేయించుకున్నాడు. గురువారం గోవా వచ్చి తాను ఆ వ్యాధిని జయించానని చెప్పుకొచ్చాడు.
మానసికంగా ధృడంగా ఉంటే దైన్నైనా సాధించగలమని ఈ తారలు నిరూపించారు. అలిసిపోతే ఆగిపోతే మరణిస్తామని తెలిసినా.. ఊపిరి ఉన్నంత వరకూ ఆశను వదలుకోకుండా పట్టుదలతో పోరాడారు. విజయం సాధించారు. వారి జీవితం ఎందరో స్ఫూర్తి దాయకం..