సెలబ్రిటీ కపుల్ విడాకులు ఖాయమైనట్లేనట..!

Update: 2022-02-01 15:38 GMT
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక సెలబ్రిటీ జంటలు తమ వైవాహిక జీవితాలను అర్థాంతరంగా ముగించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రముఖులు కూడా విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులను షాక్ కి గురి చేసింది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో ఓ సెలబ్రిటీ కపుల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఈ వ్యవహారం విడాకుల వరకూ వెళ్లిందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి

ఒక పెద్ద సినీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.. అప్ కమింగ్ హీరో అయిన తన భర్తతో విడిపోనుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటి వరకు ఇరు వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయినప్పటికీ ఈ జంట గత కొన్ని నెలలుగా కలిసి కనిపించకపోవడం.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకోవడం వంటివి ఈ వార్తలకు బలం చేకూర్చాయి.

అయితే ఈ జంట విడిపోవడం అనివార్యమని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ప్రక్రియ అంతర్గతంగా వ్యక్తిగతంగా జరగనున్నందున రెండు కుటుంబాలు దీనిపై అధికారిక ప్రకటన చేయబోవడం లేదట. అంతేకాదు ఈ వ్యవహారం పిల్లలపై ప్రభావం పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తగు జాగ్రతలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం సెలబ్రిటీ కపుల్ పిల్లల బాధ్యతను అమ్మాయి సైడ్ ఫ్యామిలీ చేసుకుంటోందని తెలుస్తోంది.

ఈ జంట విడిపోయి జీవితంలో వేర్వేరు మార్గాల్లో ముందుకు వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారట. ఫ్యామిలీ సపోర్ట్ తో ఇప్పటికే ఆమె బిజినెస్ లో ఎంటర్ అవడానికి అన్నీ రెడీ అయిపోయాయట. మరోవైపు యువ హీరోకి ఇకపై సినీ ఫ్యామిలీ మద్దతు లభిస్తుందో లేదో అని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగఫుతుందో చూడాలి.
Tags:    

Similar News