సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం.. వారి నివాసాలు ఎలా ఉంటాయో చూడాలన్న ఆకాంక్ష అభిమానులకు ఉంటుంది. స్టార్లు ఎంతో అభిరుచితో కోట్లాది రూపాయలు వెచ్చించి విశాలమైన గార్డెన్ లో అద్భుత వాస్తు శిల్పంతో రిచ్ ఇంటీరియర్స్ తో భవంతులను నిర్మించుకుంటారు కాబట్టి వాటిలో వింతలు విశేషాలు సామాన్య ప్రజల్ని గొప్పగా ఆకర్షిస్తాయి. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో కొన్ని అరుదైన జీవజాలాలు పెట్స్ ను పెంచుతున్నారని తెలిసి వాటిని వీక్షించేందుకు ప్రజలు ఆసక్తిని కనబరిచారు. చిరు స్వయంగా ఒక మొబైల్ లో సింపుల్ గా తన నివాసానికి సంబంధించిన వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది మిలియన్ల వీక్షణలను పొందింది. అయితే దీనిని ప్రొఫెషనల్ కెమెరాలో ఏరియల్ వ్యూలో వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కేవ్ ఎంతో అద్భుతంగా నిర్మించారు. అక్కడ పూరి పెంచుకునే కొన్ని పక్షులు మనుషులతో మాట్లాడుతాయి.
ఇక హైదరాబాద్ లో రిచ్ యాంబియెన్స్ తో పాటు సువిశాలమైన గార్డెన్ తో కొన్ని ఎకరాల్లో నిర్మించిన రెండు సెలబ్రిటీ గృహాలు ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. వీటిలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హైదరాబాద్ ఔటర్ లో శంషాబాద్ పరిసరాల్లో సువిశాలమైన స్థలంలో భారీ రాజ ప్రాకారాన్ని నిర్మించారు. ఇక్కడ కొన్ని ఎకరాల్లో గార్డెన్ ఉంది. చెట్లు.. స్విమ్మింగ్ పూల్స్ .. రకరకాల జాతుల మొక్కలు.. లాంజ్ పరిసరాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ విజువల్ రిచ్ ఇంటి కోసం కోట్లాది రూపాయలను వెచ్చించింది మంచు కాంపౌండ్. ఈ ఇంటిని ఏరియల్ వ్యూ షాట్స్ తో చిత్రీకరించి ఇక్కడ గార్డెన్ విశేషాలతో పాటు ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను మంచు లక్ష్మీ తన యూట్యూబ్ చానెల్ లో `నాన్న గారి హోమ్ టూర్` పేరుతో అప్ లోడ్ చేయగా మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది. ఫిల్మ్ నగర్ లోని మోహన్ బాబు పాత ఇల్లు ..నగర శివార్లలో ఆమె తండ్రి రాజభవనానికి సంబంధించిన వీడియోలు లక్షలాది వీక్షణలను పొందుతున్నాయి. తిరుపతి శ్రీవిద్యానికేతన్ సహా అక్కడ ఇంటి అతిథి గృహం విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని తన తండ్రి నివాసానికి సంబంధించిన విశేషాలను తాజాగా యూట్యూబ్ లో ప్రదర్శించారు. ఇది హైదరాబాద్ నానక్ రామ్ గూడ పరిసరాల్లో గచ్చిబౌళికి సమీపంలో ఉంది. ఈ ఇంటి పెరడు సహా వృక్షాలు ఎంతో ఆకర్షణీయంగా ఎదిగాయి. ఇక్కడే మామిడి తోటలు .. ఆర్గానిక్ వెజిటబుల్స్ తో గార్డెన్స్ అభివృద్ధి చేశారు. ఈ ఇంటిని కొన్ని ఎకరాల్లో నిర్మించారు కాబట్టి ఇక్కడ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ సహా పార్క్ యాంబియెన్స్ తో డిజైనర్ ఆకృతితో ఎంతో ఆహ్లాదంగా అందంగా కనిపిస్తోంది. కృష్ణ- విజయనిర్మల దంపతులు ఈ ప్రశాంతమైన ఇంట్లోనే గడిపారు. ఇక విజయనిర్మల మరణానంతరం తనకోసం ఒక కంచు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. వీటన్నిటికీ సంబంధించిన విజువల్స్ తో కృష్ణ వారసురాలు మంజుల ఎంతో అద్భుతమైన వీడియోని అందించారు.
ఇలాంటి వీడియోలు కామన్ ఆడియెన్ లో ఆసక్తిని కలిగిస్తాయి. వారి స్వగృహంలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహాలాన్ని కలిగిస్తాయి. కేవలం సినిమాలు సీరియళ్లే కాదు ఇటీవల మహిళామణులు మొబైల్ ఇంటర్నెట్ సాయంతో ఇలాంటి వాటి వీక్షణకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుండడంతో ఇలాంటి యూట్యూబ్ వీడియోలకు ఆదరణ పెరుగుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ ల రాజ ప్రాకారాలు కూడా చాలా విశేషాలను కలిగి ఉన్నాయి. అయితే ఇవి జూబ్లీహిల్స్ లోని ఖరీదైన ఏరియాలో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో ప్రజలకు తెలిసింది లేదు. మరి వీటికి సంబంధించిన `నాన్న గారి ఇల్లు` వీడియోలు చేస్తే అభిమానులు వీక్షించేందుకు వీలుంటుంది. కానీ అంత తీరిగ్గా ఈ వీడియోలు యూట్యూబ్ కోసం చేసేది ఎవరు? అన్నది వేచి చూడాలి.
Full View