పెళ్లికి ముందే ఇల్లు సెట్‌ చేసుకున్న సెలబ్రెటీ లవ్‌ బర్డ్స్‌

Update: 2022-04-22 16:30 GMT
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి క్రికెట్‌ రంగంలో ఉన్న వారికి ప్రేమ వ్యవహారం అనేది ఈమద్య కాలంలో చాలా కామన్ విషయంగా మారింది. ఎంతో మంది టీం ఇండియా క్రికెటర్ హీరోయిన్స్ ను లేదా ఇండస్ట్రీకి చెందిన వారిని ప్రేమించారు.. చాలా మంది ప్రేమించి అందులో మెజార్టీ మెంబర్స్ పెళ్లి వరకు కూడా వెళ్లారు. బాలీవుడ్‌ కు మరియు క్రికెట్‌ కు సంబంధం అలా కలిసి వస్తూ ఉంది.

ప్రస్తుతం అందరి దృష్టి బాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరో సునీల్‌ శెట్టి కూతురు అతియా శెట్టి మరియు టీం ఇండియా యువ సంచలనం కేఎల్‌ రాహుల్‌ ల మద్య ప్రేమ గురించిన చర్చ జరుగుతోంది. వీరిద్దరు కలిసి మూడు సంవత్సరాలుగా తెగ తిరిగేస్తున్నారు. కరోనా ఇతరత్రా కారణాల వల్ల వీరి పెళ్లి వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ 2022 లో వీరి పెళ్లి ఖచ్చితంగా జరుగబోతుంది అనేది టాక్‌.

పెళ్లి ఇంకా జరగక ముందే వీరిద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్‌ లో ప్లాట్‌ ను బుక్ చేసుకున్నారు. అద్దె కు ఆ ప్లాట్‌ ను తీసుకున్న కేఎల్‌ రాహుల్‌ ఏకంగా పది లక్షల రూపాయలను ఆ ప్లాట్‌ కు నెల నెల చెల్లిస్తున్నాడట. ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏరియాలో అది కూడా సముద్రం ఫేసింగ్ కలిసిగి ఉన్న ప్లాట్‌ అవ్వడం వల్ల నెలకు అంత మొత్తం ను వీరు చెల్లించేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది.

పెళ్లి అయ్యేంత వరకు వీరిద్దరు అందులోనే టైమ్‌ స్పెండ్‌ చేస్తారట. సోషల్‌ మీడియాలో వీరి గురించి ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నా కూడా చాలా సింపుల్‌ గా కూల్ గానే వీరు తమ వ్యవహారంను సాగిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వీరి పెళ్లి గురించి వెయిట్‌ చేస్తున్నామని అంటున్నారు. క్రికెటర్ గా మంచి ఫామ్‌ లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్న నేపథ్యంలో క్రీడాభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News