సినీ వినీలాకాశం నుండి మరో తార రాలిపోయింది. నటిగా ఎన్నో అద్బుత చిత్రాల్లో నటించి.. దర్శకురాలిగా ఏకంగా గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్న విజయనిర్మల తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది. ఆమె మరణం ఆమెతో ఉన్న ప్రతి ఒక్కరికి కన్నీరును మిగిల్చింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళ్లు అర్పిస్తున్నారు.
విజయ నిర్మల మృతిపై చిరంజీవి స్పందిస్తూ... దర్శక నటీమణి శ్రీమతి విజయ నిర్మల గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగ్గ బహుమఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయ నిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. బాల నటిగా - కథానాయికగా.. దర్శకురాలిగా.. నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అంతటి గొప్ప వ్యక్తిని మనం ఇప్పట్లో చూడలేం. కృష్ణ గారి జీవిత భాగస్వామిగా ఎప్పుడు ఆయనకు పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటి ఆమె మరణం యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ... విజయ నిర్మల మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ... విజయ నిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలయజేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ - వారి అభిమానులకు - కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. విజయ నిర్మల గారి మృతి నాకు దిగ్ర్బాంతి కలిగించింది. నటిగా.. దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారు. మీరు ఎంతో మంది మహిళలకు ఆదర్శం. కృష్ణ గారికి.. నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.
బాలకృష్ణ స్పందిస్తూ... సినిమా పరిశ్రమలో మహిళా సాధికారతను చాటి చెప్పిన అతి కొద్ది మంది మహిళల్లో విజయ నిర్మలగారు ఒకరు. నాన్నగారి పాండురంగ మహత్యం సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించారు. అదే ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నాన్నగారితో కలిసి చేశారు. అలాగే దర్శకురాలిగా 44 సినిమాలను తెరకెక్కించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుని ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
ఎన్టీఆర్ స్పందిస్తూ... విజయ నిర్మల గారి జీవితం ఎంతో మందికి మార్గదర్శకం. మరెంతో మందికి ఇన్సిపిరేషన్. ఆమె మరణ వార్త నాకు బాధ కలిగించింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
సుధీర్ బాబు స్పందిస్తూ... ఈ రోజు చాలా భయంకరమైన రోజు.. మా కుటుంబం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఓ మార్గదర్శి ఓ లెజెంట్ ఓ అమ్మలాంటి వ్యక్తి దేవుడి వద్దకు పయనం అయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
విజయ నిర్మల మృతిపై జీవిత రాజశేఖర్ లు స్పందిస్తూ... మంచి మనిషికి నిలువెత్తు నిదర్శనం విజయ నిర్మలగారు. ఆవిడ ఒక లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళలకు ఆమె స్ఫూర్తి. అప్పటి నుండి ఇప్పటి వరకు విజయ నిర్మల గారికి సరితూగే వ్యక్తి ఎవరు లేరనడంలో అనుమానమే లేదు. ఆవిడ మరణ వార్త మాకు దుఖ:ను మిగిల్చింది. చివరిసారిగా ఆమెను కృష్ణ గారి పుట్టిన రోజు వేడుక సందర్బంగా కలవడం జరిగింది. అప్పటికే ఆమె అనారోగ్యంతో నడవడంకు ఇబ్బంది పడుతున్నారు. విజయ నిర్మల గారు అంటే ఆడపులి. అలాంటి ఆవిడ నడవడంకు ఇబ్బంది పడటం చూసి బాధేసింది. ఆమె మృతి అందరి కంటే ఎక్కువగా కృష్ణగారికి తీరని లోటు. ఆయన్ను చూస్తే బాధగా ఉందన్నారు.
అల్లరి నరేష్ స్పందిస్తూ... విజయ నిర్మల గారు తెలుగు సినిమా పరిశ్రమకు పిల్లర్ వంటి వారు. ఆమె తన నటన మరియు దర్శకత్వంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
రాశిఖన్నా స్పందిస్తూ.. విజయ నిర్మల గారి హఠన్మరణం నాకు బాధను కలిగించింది. ఆమె ఎంతో మందికి ఆదర్శవంతురాలు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
నితిన్ స్పందిస్తూ... విజయ నిర్మల గారి మరణ వార్త బాధ కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.