విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో పద్మావత్ టీంకు బిపి లెవెల్స్ అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ పరిస్థితి ఎలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాం. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినా, కోర్ట్ సైతం అడ్డంకులు సృష్టించడానికి వీలు లేదని స్పష్టంగా తీర్పు ఇచ్చినా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గుజరాత్ - రాజస్తాన్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. కర్ణి సేన విడుదలను అడ్డుకుని తీరాలి అనే పంతంతో నిరసన కార్యక్రమాలు తీవ్రం చేసారు. సంజయ్ లీలా భన్సాలీ కూడా తన మీద సినిమాలో కంటెంట్ మీద సాధ్యమైనంత వరకు ఏ చిన్న విమర్శ - వివాదం రేగకుండా ఉండేందుకు ఎంత చేయాలో అంతకు మించే చేస్తున్నాడు.
ఇందులో పాటలకు సైతం సెల్ఫ్ సెన్సార్ చేసుకుని గ్రాఫిక్స్ నిపుణల సహాయంతో దీపిక పదుకునే పోషించిన పద్మావతి పాత్ర నడుము కూడా కనిపించకుండా ఉండేందుకు నానా తిప్పలు పడ్డారు. పాటలతో సహా పద్మావత్ షూటింగ్ మొత్తం అక్టోబర్ లోనే పూర్తయ్యింది. అందులో పద్మవతి పాత్ర సహజ సిద్ధమైన సాంప్రదాయ దుస్తుల్లోనే ఉన్నప్పటికీ ఒకటి రెండు పాటల్లో తన నడుము కనిపించేలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇంకేముంది వాటి మీద వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో నడుము భాగాన్ని పూర్తిగా కవర్ చేయటంతో ఇప్పుడు కొంత నిశ్చింతగా ఉందట భన్సాలీకి.
అయినా భారతీయ సగటు మహిళ చీర కట్టులో నడుము భాగం కొంత వరకు కనిపించడం సర్వ సాధారణం. అందులో అసభ్యత - అశ్లీలత అనే పదాలకు చోటు లేదు. అలాంటప్పుడు విమర్శలకు ఇంతగా భయపడి అభ్యంతరకరం కాని నడుముని కూడా గ్రాఫిక్స్ లో కప్పి పెట్టి మేనేజ్ చేయటం పట్ల సర్వత్రా విచారం వ్యక్తం అవుతోంది. పద్మావత్ ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోస్ దేశవ్యాప్తంగా మొదలు కాబోతున్నాయి. ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలు పెట్టేసారు. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటే బుక్ చేసుకుని ఆ రోజే చూసేయటం సేఫ్.