వరల్డ్ ఫేమస్ లవర్ కు షాకిచ్చిన సెన్సార్

Update: 2020-02-11 05:30 GMT
మహా అయితే మరో రెండు రోజులు ఆగితే చాలు.. యూత్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. రిలీజ్ కు ముందు సినిమా హైప్ ను మరో లెవల్ కు తీసుకెళ్లే ప్రమోషన్ యాక్టివిటీస్ ఇప్పటికే జోరందుకున్నాయి. రౌడీ లవ్ మూవీ కావటం.. ఇప్పటికే విడుదలైన టీజర్.. పాటలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. యూ/ఎ ఇచ్చేస్తూ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఊహించని రీతిలో సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమా టీజర్ లో పాపులర్అయిన డైలాగ్ మీద అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్.. దాన్ని తొలగించి షాకిచ్చింది.

అంతేకాదు.. హిందీ.. ఇంగ్లిషు సినిమాల్లో తరచూ వాడే బూతుపదాన్ని మ్యూట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని చోట్ల కూడా మ్యూట్ తప్పదని చెబుతున్నారు. ఈ చిత్ర నిడివి 155.37 నిమిషాలుగా ఫైనల్ చేశారు. నలుగురు హీరోయిన్ల తో కలిసి సందడి చేయనున్న విజయ దేవరకొండ.. తానీ సినిమా తర్వాత లవ్ కాన్పెప్టు తో చేయనని చెప్పటం తెలిసిందే.
Tags:    

Similar News