చక్కని పిల్లా.. అంటున్న ప్రభుదేవా

Update: 2019-05-23 07:57 GMT
ప్రభుదేవా.. తమన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'అభినేత్రి 2' మే 31 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు విజయ్ రూపొందించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్.. అభిషేక్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.  సినిమా రిలీజ్ కు తక్కువ సమయం ఉండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా కొద్ధిరోజుల క్రితం 'రెడీ రెడీ' అంటూ సాగే ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి 'చక్కని పిల్లా' అనే మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ పాటకు సాహిత్యం అందించిన వారు వనమాలి.  "చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే.." అంటూ లిరిక్స్ ఫన్నీగా సాగాయి.  ఈ పాట పాడినవారు దివాకర్.  ఈ పాటలో ప్రభుదేవా హీరోయిన్ నందితా శ్వేత వెంట పడుతో ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.  భార్యగా తమన్నా ఉండగా ప్రభుదేవా ఎందుకు ఈ రెండో హీరోయిన్ వెనక పడుతున్నాడో ఏంటో సినిమా చూస్తే కానీ మనకు తెలిసేలా లేదు.

సిట్యుయేషన్.. ఫన్నీ లిరిక్స్ అంతా బాగానే ఉంది కానీ సామ్ సిఎస్ అందించిన ట్యూన్ మాత్రం సోసోగానే ఉంది. కొత్తగా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా మాత్రం లేదు. మరి ప్రభుదేవా తన స్టెప్పులతో ఈ పాటను స్పెషల్ గా మారుస్తాదేమో వేచి చూడాలి. ఆలస్యం అంతలోపు ఈ చక్కనిపిల్లపై ఒక లుక్కేయండి.


Full View

Tags:    

Similar News