దివంగత సంగీత దర్శకుడు చక్రి ఆస్తులపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. హైద్రాబాదులో ఓ అపార్ట్ మెంట్ ఎదుట చక్రి తల్లి కళావతి - కొడుకు మహిత్ ధర్నాకు దిగడంతో.. ఈవివాదం మరింత పెద్దదైంది. నాలుగు రోజులుగా ఆ ఇంట్లో ఉన్న అద్దెకు ఉంటున్న మాధవిని ఖాళీ చేయాల్సిందిగా పోరాడుతున్నారు. అయితే.. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున కొందరు పోలీస్ స్టేషన్ కు వచ్చి చక్రి కుటుంబాన్ని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు సంపాదించిన ఆస్తులన్నీ కోడలి పేరుమీదే ఉన్నాయని.. కనీసం తమకు ఉండటానికి ఇల్లు కూడా లేదని చక్రి తల్లి అంటున్నారు. ఇలాంటి కోడలిని తానెక్కడా చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. తన ఒంట్లో చివరి ఊపిరి ఉన్నంతవరకూ ఇంటికోసం పోరాడతానని చెప్పారు.
మొయినాబాద్ - సోమాజిగూడ - శామీర్ పేట - శంషాబాదులో కొన్న ప్లాట్లు - ఇళ్లు చక్రి సంపాదించాడని.. గుంటూరులో అయిదెకరాల పొలం ఉందని ఆమె చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లాట్ ను అమ్మేసుకున్నారని, తనకు ఓ ఆడి కారు ఉందని చక్రి సోదరుడు అంటున్నారు. అయితే ఈ ఆస్తుల లిస్ట్ ని చక్రి భార్య ఖండించారు. తన భర్త తనకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేదని చెబ్తున్నారు చక్రి భార్య శ్రావణి.