చిత్రం : 'చాణక్య'
నటీనటులు: గోపీచంద్ - మెహ్రీన్ పిర్జాదా - నాజర్ - రాజేష్ ఖట్టర్ - ఉపేన్ పటేల్ - రాజా సిరివెన్నెల - ఆదర్శ్ బాలకృష్ణ - సునీల్ - రఘుబాబు - ఆలీ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: వెట్రి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: అనిల్ సుంకర
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: తిరు
హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ‘లౌక్యం’ తర్వాత అతడి కెరీర్లో ఓ మోస్తరు విజయం కూడా లేదు. చివరగా అతను చేసిన ‘పంతం’ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడతను తమిళ దర్శకుడు తిరుతో జట్టు కట్టి ‘చాణక్య’ అనే స్పై థ్రిల్లర్ చేశాడు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్. అతను ఏ మిషన్ చేపట్టినా అది సక్సెసే. సిరియాలో ఒక ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన అతను.. తన ఐడెంటిటీ తెలియకుండా బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. ఆ క్రమంలో అతడికి ఐశ్వర్య (మెహ్రీన్) పరిచయమవుతుంది. ఆమె అతడి ప్రేమలో పడుతుంది. ఐతే అర్జున్ చేసిన ఆపరేషన్ల వల్ల తన కార్యకలాపాలు సాగించలేకపోతున్న పాకిస్థాన్ మాఫియా డాన్ ఖురేషి అతడి కొడుకు సోహైల్ కలిసి.. అర్జున్ టీంలోని మిగతా సభ్యుల్ని కిడ్నాప్ చేయించి పాకిస్థాన్ కు తీసుకెళ్లిపోతారు. ఈ స్థితిలో అర్జున్ తన స్నేహితుల్ని ఎలా కాపాడుకున్నాడు.. ఖురేషి, అతడి కొడుకు ఆట ఎలా కట్టించాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘చాణక్య’ సినిమాలో హీరో ‘రా’ ఏజెంట్. ఆ విషయాన్నేమీ దాచి పెట్టరు. మొదట్లోనే బయటపెట్టేస్తారు. పైకి మాత్రం ఒక బ్యాంకు ఉద్యోగిగా కనిపించే అతను.. అప్పుడప్పుడూ సెలవు మీద వెళ్లి ఆపరేషన్లు చేసి వస్తుంటాడు. బ్యాంకు విధుల్లో భాగంగా అతను కస్టమర్ అయిన హీరోయిన్ కి ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. హీరోయిన్ కొంచెం తేడాగా మాట్లాడేసరికి ఇతను స్వరం పెంచుతాడు. దీంతో ఏంటి నువ్వు బోర్డర్స్ దాటుతున్నావ్ అంటే.. ‘‘అవును.. అవసరమైతే నేను దేశాల మధ్య బోర్డర్స్ దాటుతాను.. అది నా డ్యూటీ’’ అని డైలాగ్ కొడతాడు. ఇదీ ఒక రా ఏజెంట్ పాత్రను తెరపై ప్రెజెంట్ చేసిన తీరు. దీన్ని బట్టే ఈ సినిమా ఎలా నడుస్తుందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు.
హీరోను మామూలు పోలీస్ పాత్రల్లో చూపించి ఎన్ని విన్యాసాలు చేయించి.. లాజిక్ కు అందకుండా ఎంత తతంగం నడిపించినా సర్దుకుపోవచ్చు కానీ.. రా ఏజెంట్ అన్నాక ఆ పాత్ర చిత్రణలో కొంత అథెంటిసిటీ ఆశించడం సహజం. భాషల మధ్య హద్దులు చెరిగిపోయి ‘విశ్వరూపం’.. ‘బేబీ’.. ‘రాజి’ లాంటి సినిమాల ద్వారా రా ఏజెంట్లు అంటే ఎలా ఉంటారో.. ఆ విభాగం పనితీరు ఎలా ఉంటుందో మన ప్రేక్షకులు కూడా బాగానే అవగాహన ఉంది. వేరే భాషలదాకా ఎందుకు? మన దగ్గరే ‘గూఢచారి’ అనే సినిమా వచ్చింది. దాని బడ్జెట్ పరంగా చాలా పరిమితులుండొచ్చు. కంటెంట్ మాత్రం అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుంది. రచయిత.. దర్శకుడు ఎంత పరిశోధన చేసి.. ఎంత పకడ్బందీగా సినిమాను తీర్చిదిద్దారో చూశాం. కానీ అదే సినిమాకు పని చేసిన అబ్బూరి రవి.. ‘చాణక్య’కు కూడా మాటలు రాశాడు. పైన చెప్పుకున్న డైలాగ్ పేల్చింది కూడా ఆయనే. కానీ పైన చెప్పుకున్న స్పై థ్రిల్లర్లకు ‘చాణక్య’కు ఎంతో అంతరం ఉంటుంది. స్పై థ్రిల్లర్ అనగానే అంతర్జాతీయ స్థాయి వ్యవహారాల మీదే కథ నడుస్తుంది. కానీ ఈ కథను నడిపించిన తీరు మాత్రం చాలా ‘లోకల్’గా అనిపిస్తుంది. మన దగ్గర తెరకెక్కే పోలీస్ కథలకు దీనికి ఏమాత్రం తేడా లేదు. ఈ కథకు కమర్షియల్ హంగులు అద్దడానికి చేసిన ప్రయత్నం వల్ల మొత్తం వ్యవహారం చెడిపోయి ‘చాణక్య’ ఒక సాదాసీదా సినిమాగా మిగిలిపోయింది.
హీరోయిన్ దగ్గరో మగ కుక్క ఉంటుంది. అది వయసుకు వస్తుంది. దానికి మేటింగ్ (మనుషులకైతే డేటింగ్.. కుక్కలకైతే మేటింగ్) చేయించడానికి ఆడ కుక్క కోసం వెతుకుతుంటుందామె. హీరో దగ్గరే దానికి సరిపోయే కుక్క ఉందని తెలిసి అతడి దగ్గరికెళ్తే అతను మేటింగ్ కు ఒప్పుకోడు. నీ కుక్క కాకపోతే వేరే కుక్క లేదా అని కుక్కల డాక్టర్ ను వెంటేసుకుని ఢిల్లీ అంతా తిరిగేస్తుంది. ఒక ఇంట్లో కుక్కకు వయసు మరీ తక్కువ. చైల్డ్ అబ్యూస్ కేస్ అవుతుందని భయపడుతుంది. ఇంకో ఇంట్లో మగ కుక్క ఉంటుంది. గే సెక్స్ అని కేసు పెడతారేమో అని కంగారు పడుతుంది. ఇలా ఇళ్లన్నీ తిరిగి తిరిగి చివరికి హీరో గారి కుక్కనే కిడ్నాప్ చేయించి మేటింగ్ చేయిస్తుంది హీరోయిన్. ఒక కుక్క కోసం హీరోయిన్ పడే తపన చూసి హీరో ఇంప్రెస్ అయిపోతాడు. ఇలా హీరో హీరోయిన్ దగ్గరవుతారు. ఒక స్పై థ్రిల్లర్లో పావు గంటకు పైగా నడిచే ‘కామెడీ’ ట్రాక్ ఇది. స్పై థ్రిల్లర్ అంటే హీరో ఏదో మిషన్ మీద ఉంటాడని.. ఉత్కంఠతోో ఊగిపోయేలా కథనం సాగుతుందని అనుకుంటే.. మనకు ఈ కుక్కల కామెడీతో కాలక్షేపం చేయిస్తాడు దర్శకుడు. ఇక ద్వితీయార్దంలో కథ కొంచెం సీరియస్ గా సాగుతుండగా.. పాట వచ్చి చాలా టైం అయిందని గుర్తుకొచ్చి హీరోతో పాకిస్థాన్ నుంచి హీరోయిన్ కు ఫోన్ చేయిస్తాడు. ఆమె డ్యూయెట్ వేసుకుంటుంది. ఇలా దర్శకుడు కామెడీ, రొమాన్స్ మసాలాల్ని భలేగా అద్దాడు ‘చాణక్య’కు.
తెలుగు సినిమానే కాదు.. మన ప్రేక్షకుల అభిరుచి కూడా ఎంతో మారి కొత్తదనం వైపు అడుగులేస్తుంటే.. తమిళ దర్శకుడు తిరు వచ్చి మన సినిమాను మళ్లీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ‘చాణక్య’తో. కథాకథనాల్లో ఎంతమాత్రం కొత్తదనం లేని ‘చాణక్య’ ఆరంభంలో హీరో చేపట్టే ఓ మిషన్ తో మొదలవుతుంది. అది పర్వాలేదనిపించాన.. అతను ఏజెంట్ అవతారం నుంచి బ్యాంకు ఉద్యోగిగా మారాక ప్రేక్షకుల సహనానికి పరీక్ష మొదలవుతుంది. పసలేని కామెడీ.. రొమాంటిక్ ట్రాక్ లు ప్రేక్షకుల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తాయి. విరామ సమానికి పూర్తిగా సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఐతే హీ రో పాకిస్థాన్ కువ వెళ్లిపోయి ఒక లేడీ ఏజెంట్ సహకారంతో మిషన్ నడిపే వ్యవహారం ఇల్లాజికల్ గా అనిపించినప్పటికీ.. ద్వితీయార్ధంలో ఇదే ప్రేక్షకుల్ని ఒక మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది. మరీ థ్రిల్ చేసే మూమెంట్స్ లేకపోయినా.. రెండో అర్ధంలో అయితే కథనం కొంచెం వేగంగా సాగుతుంది. కానీ క్లైమాక్స్ మరీ రొటీన్ గా ఉండటంతో ‘చాణక్య’ మీద ఇంప్రెషన్ అయితే మారిపోదు. ఓవరాల్ గా చూస్తే ద్వితీయార్ధంలో కొన్ని ఎపిసోడ్లు మినహాయిస్తే ‘చాణక్య’లో పెద్ద విశేషాలేమీ లేవు.
నటీనటులు:
పెర్ఫామెన్స్ పరంగా గోపీచంద్ ఓకే అనిపించాడు. బ్యాంకు ఉద్యోగిగా అతను తేలిపోయినప్పటికీ.. ఏజెంట్ పాత్రలో పర్వాలేదు. ట్రెండుకు తగ్గట్లు గడ్డం పెంచి లుక్ పరంగా మెప్పించినప్పటికీ.. ఇంతకుముందు మనం చూసిన రా ఏజెంట్ పాత్రలతో పోల్చి చూస్తే ఈ లుక్ సెట్ కాలేదు.పెద్ద పెద్ద స్టార్లే కమర్షియల్ హంగులు వీడి కొత్త తరహా కథల వైపు అడుగులేస్తుంటే గోపీచంద్ ఇంకా ఇలాంటి కథలే ట్రై చేయడం ఆశ్చర్యకరం. మెహ్రీన్ పిర్జాదా పాత్ర పరమ రొటీన్ గా అనిపిస్తుంది. ఒక క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ లేని పాత్రలో ఆమెను ఎంతమాత్రం గుర్తుంచుకునే అవకాశాలు లేవు. పాటల్లో కొంచెం గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విలన్ పాత్రలో రాజేష్ ఖట్టర్ చేసిందేమీ లేదు. అతడితో పోలిస్తే ఉపేన్ పటేల్ పర్వాలేదనిపించాడు. నాజర్ స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదు. సునీల్ ఉన్న కాసేపట్లో అసలేమాత్రం నవ్వించలేకపోయాడు. రఘుబాబు పర్వాలేదు. ఆలీ తన మార్కు డబుల్ మీనింగ్ డైలాగులతో రొటీన్ కామెడీ చేశాడు. లేడీ ఏజెంట్ గా చేసిన జరీన్ ఖాన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతిక వర్గం:
ప్రేమకథలకు మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ చేసే విశాల్ చంద్రశేఖర్ ను ‘చాణక్య’ లాంటి కమర్షియల్ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. అతను తన శైలిలోనూ పాటలు చేయలేదు. అలాగని మంచి మాస్ పాటలూ ఇవ్వలేదు. రెంటికీ చెడ్డ విధంగా ఇచ్చిన పాటల్లో ఏదీ అంతగా ఆకట్టుకోలేదు. శ్రీచరణ్ పాకాల.. ‘గూఢచారి’.. ‘ఎవరు’ స్టయిల్లోనే మ్యూజిక్ చేశాడు కానీ.. అది ఈ సినిమాలో సింక్ అవలేదు. వెట్రి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. అనిల్ సుంకర బాగానే ఖర్చు పెట్టాడు. అబ్బూరి రవి తన మాటల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఇవ్వలేదు. తమిళంలో ‘నాన్ సిగప్పు మనిదన్’ (తెలుగులో ఇంద్రుడు) లాంటి వైవిధ్యమైన థ్రిల్లర్ తో మంచి పేరు సంపాదించిన తిరు.. తెలుగులోకి వచ్చి ఇలాంటి సినిమా తీస్తాడని అసలు ఊహించలేం. అతను గత నాలుగైదేళ్లుగా తెలుగు సినిమాలు చూస్తున్నట్లు లేడు. ఎలాంటి కథకైనా కమర్షియల్ హంగులద్దే ఒకప్పటి తెలుగు సినిమా స్టయిల్లోనే అతన ‘చాణక్య’ను తీర్చిదిద్దాడు. ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తీశానన్నాడు కానీ.. అథెంటిసిటీ మిస్ అయింది. సగటు మసాలా సినిమాలానే ఇది తయారైంది.
చివరగా: చాణక్య.. థ్రిల్లింగ్ కాదు బోరింగ్
రేటింగ్-2.25/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre