బన్నీ ని సర్‌ ప్రైజ్ చేసిన ముద్దుగుమ్మకు బిబి ఓటీటీలో ఛాన్స్‌

Update: 2022-02-09 07:30 GMT
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు బిగ్‌ బాస్ ను ఓన్‌ చేసుకున్నారు. హిందీ ప్రేక్షకులను మించి తెలుగు ప్రేక్షకులు బిగ్‌ బాస్ ను చూస్తున్నట్లుగా గత సీజన్ లకు వచ్చిన రేటింగ్‌ ను బట్టి అర్థం అవుతుంది. సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ చేస్తున్న బిగ్‌ బాస్ కు ఏమాత్రం తగ్గకుండా తెలుగు లో కూడా బిగ్‌ బాస్ నడుస్తుంది. ఈ సమయంలో హిందీలో ఓటీటీ బిగ్ బాస్ వచ్చింది. దాంతో తెలుగు లో కూడా ఓటీటీ బిగ్ బాస్ కు సిద్దం అయ్యారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో బిగ్‌ బాస్ ఓటీటీ సీజన్ 1 ను ఈనెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పెద్ద ఎత్తున ఈ ఓటీటీ బిగ్‌ బాస్ లోకి పాత కంటెస్టెంట్స్ ను పంపించబోతున్నారట. గత సీజన్ ల్లో వివాదాస్పద కంటెస్టెంట్స్ గా పేరు దక్కించుకున్న వారికి ఈ ఓటీటీ బిగ్‌ బాస్ లో అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే కంటెస్టెంట్స్ అంతా కూడా క్వారెంటైన్ కు వెళ్లబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ తో అగ్రిమెంట్‌ పూర్తి అయ్యింది.

వారికి సంబంధించిన ఎంట్రీ వీడియోలను చిత్రీకరిస్తున్నారు. ఈనెల 15వ తారీకు వరకు ఏర్పాట్లు చేసి కంటెస్టెంట్స్ ను క్వారెంటైన్ చేయబోతున్నారు. ఈ సమయంలో కొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. హాట్‌ యాంకర్ గా పేరున్న స్రవంతి చొక్కారపు కు ఛాన్స్ దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన స్రవంతి చొక్కారపు సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లి తెరకు షిప్ట్‌ అయ్యింది. అక్కడ ఒక స్థాయిలో ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. అయితే ఈమె ఇన్ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేస్తున్న హాట్‌ ఫొటోలు మరియు వీడియోల వల్ల మరింతగా పాపులారిటీని దక్కించుకుంది.

ఈటీవీలో ప్రసారం అయ్యే కామెడీ షోలతో పాటు అప్పుడప్పుడు ఇతర బుల్లి తెర షో ల ద్వారా కూడా పాపులారిటీ అయ్యింది. ఆ మద్య పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ అమ్మడు అల్లు అర్జున్ తో రాయలసీమ యాసలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈమె మాట్లాడిన యాసకు బన్నీ సర్ ప్రైజ్ అయ్యాడు. ఆమె యాసకు బన్నీ నుండి ప్రశంసలు కూడా దక్కాయి. దాంతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరిగింది. తద్వార ఈమెకు బిగ్‌ బాస్ లో ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

సాదారణంగానే బిగ్‌ బాస్ అంటే కాస్త మసాలా ఉండి వివాదాలు ఉండాలి. ఇక ఓటీటీ బిగ్‌ బాస్ అంటే సెన్సార్ ఉండదు.. యూత్‌ ఆడియన్స్‌ ఎక్కువగా చూస్తారు కనుక గ్లామర్ డోస్‌ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్రవంతి లాంటి వారిని ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ షో కు ఎంపిక అయిన ముద్దుగుమ్మలతో ఇప్పటికే నిర్వాహకులు అందాలు ఆరబోసే విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా వివాదాలు మరియు రొమాన్స్ లకు కూడా ఒప్పుకున్న తర్వాత అగ్రిమెంట్‌ లు జరిగాయని తెలుస్తోంది. మరి ఈ హాట్‌ యాంకర్‌ స్రవంతి ఏ స్థాయిలో బిగ్‌ బాస్ ఓటీటీ లో సందడి చేయబోతుందో చూడాలి.
Tags:    

Similar News