విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తుండగా - మోక్షజ్ఞ నూనూగు మీసాల నిమ్మకూరు ఎన్టీఆర్ లా కనిపించనున్నాడన్న టాక్ వినిపించింది. `గౌతమిపుత్ర శాతకర్ణి` ఫేం క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం పెద్ద హైప్ కి కారణమైంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తో ఈ జోడీ 100కోట్ల క్లబ్ లో అడుగుపెడుతుందా? నటసింహం 100కోట్ల షేర్ తెస్తారా? ప‌్రస్తుతం జనంలో హాట్ టాపిక్ ఇది.
అయితే బాలయ్యను శాతకర్ణిగా చూపించి అతడి మార్కెట్ రేంజును క్రిష్ అమాంతం పెంచిన మొనగాడు క్రిష్ అనడంలో సందేహం లేదు. అసలు బాలయ్యను 50కోట్ల క్లబ్ హీరోని చేసింది క్రిష్. బోయపాటిని మించిన బంపర్ హిట్ తీసి సత్తా చాటాడు. పైగా ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక లాంటి భారీ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే అన్నగారు ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా `ఎన్టీఆర్` బయోపిక్ 100 కోట్ల బిజినెస్ చేయడం ఖాయమంటూ చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని 100కోట్లకు అమ్మాలని బాలయ్య- క్రిష్ బృందం పక్కాగా స్కెచ్ వేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్ ని ఈ చిత్రానికి వెచ్చిస్తున్నారు. అయితే 100కోట్ల బిజినెస్ చేస్తే కనీసంగా 100 కోట్ల షేర్ లేదా 200కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే హిట్టు కింద లెక్క. అంటే చరణ్ రంగస్థలం - మహేష్ భరత్ అనే నేను రేంజు హిట్టు కొట్టాలి. అయితే బాలయ్యకు అంత సీనుందా? ఎన్టీఆర్ ఛరిష్మా అంత వసూళ్లు తెస్తుందా? అంటూ వేరొక వర్గం విసుర్లు విసురుతోంది. అయితే ప్రపంచం మొత్తం తెలిసిన ఎన్టీఆర్ పై సినిమా అంటే తక్కువ అంచనా వేయలేం. పైగా బాలయ్య రేంజు 70కోట్ల గ్రాస్ పైమాటేనని `గౌతమిపుత్ర శాతకర్ణి` నిరూపించింది. అందుకే ఈసారి 100కోట్లు కొట్టేస్తాడా? అన్న విశ్లేషణ సాగుతోంది. 2019 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాని నందమూరి అభిమానులే తలకెత్తుకుని అంత పెద్ద హిట్ చేస్తారేమో చూడాలి. కీర్తి సురేష్ నటించిన `మహానటి` 45 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆఫ్ట్రాల్ ఆడది! అనేస్తారు. ఆడది అయిన సావిత్రి బయోపిక్ ఇండస్ట్రీలోనే ఓ కుదుపు. ఈ సినిమా 45కోట్ల షేర్ - 80 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ అందుకు డబుల్ ట్రిపుల్ సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. ఆ ఫీట్‌ని నటసింహం నిజం చేసి చూపిస్తారా.. అన్నది వేచి చూడాలి.