ట్రెండీ టాక్‌: ప్ర‌యోగ‌శాల‌గా మారిన చంద‌మామ‌?!

Update: 2021-03-21 04:30 GMT
చంద్రునిపై ప్ర‌యోగాల గురించి తెలుసు కానీ.. చంద‌మామే ప్ర‌యోగాలు చేయ‌డం తెలుసా?  భూమ్మీద ఈ అరుదైన చంద‌మామ వ‌రుస ప్ర‌యోగాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇన్నాళ్లు గ్లామ‌ర‌స్ నాయిక‌గా యువ‌త‌రం హృద‌యాల్ని దోచేసిన చంద‌మామ‌ కాజ‌ల్ ఇటీవ‌ల లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకున్నారు. స్క్రిప్టు ప‌రంగా వైవిధ్యం ఉంటే న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్ని ఎంక‌రేజ్ చేస్తూ నిర్మాత‌గానూ పెట్టుబ‌డులు పెట్టేందుకు కాజ‌ల్ సిద్ధ‌మ‌య్యారు. కాజల్ ఇటీవ‌ల వ‌రుస ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు.

ఓవైపు కింగ్ నాగార్జున - ప్ర‌వీణ్ స‌త్తారు క్రేజీ కాంబినేష‌న్ మూవీలో రా ఏజెంట్ గా న‌టిస్తున్న కాజ‌ల్ త‌దుప‌రి ర‌వితేజ ఖిలాడీలో ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. ఓవైపు రా ఏజెంట్ గా యుద్ధభూమిలో మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నైపుణ్యం చూపిస్తూ రైఫిల్ ఫైరింగ్ లోనూ కాజ‌ల్ ప్రావీణ్యం చూపించ‌నుంది.

మ‌రోవైపు ర‌వితేజ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ లేడీ కాప్ పాత్ర‌లో మెరుపులు మెరిపించ‌నుంద‌ని తెలిసింది. కేవ‌లం ఇది అతిథి పాత్ర మాత్ర‌మే అయినా కొన్ని నిమిషాల నిడివితో ఎంతో ప్ర‌భావ‌వంతంగా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఖిలాడీ చిత్రానికి ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా రాక్ష‌సుడు నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ర‌వితేజ ఇందులో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లోనూ కాజల్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో న‌టించేందుకు అంగీక‌రించ‌డానికి కార‌ణం..త‌న‌కు రీఫ్రెషింగ్ గా ఉంటుంద‌నే... రా ఏజెంట్ పాత్ర‌కు కాజ‌ల్ హైట్ వెయిట్ ప్ల‌స్ అవుతాయ‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు అన్నారు. ఖిలాడీ మూవీలో లేడీ కాప్ గా స్టార్ హీరోయిన్ అయితేనే బావుంటుంద‌ని ర‌వివ‌ర్మ భావించార‌ట‌. ఏదేమైనా కాజ‌ల్ వ‌రుస ప్ర‌యోగాలు అభిమానుల‌కు పెద్ద స‌ర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. మ‌రోవైపు చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌గా ఆడిపాడుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News