చౌదరి పిల్లకు ఇచ్చింది ఒక్క సీనే

Update: 2016-05-27 05:35 GMT
టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు హీరోయిన్లుగా కనిపించే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అరువు తెచ్చుకునే భామలు - అరవ హీరోయిన్లకే తప్ప.. తెలుగోళ్లకు డిమాండ్ ఏమాత్రం ఉండదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అంజలి - శ్రీదివ్య లాంటి భామలు కూడా తమిళ్ లో ప్రూవ్ చేసుకున్నాకే తెలుగోళ్లు గుర్తించడం ఆశ్చర్యకరం.

ఈ మధ్య కాలంలో షార్టు ఫిలింస్‌ తో పాపులర్‌ అయిన హీరయిన్ చాందినీ చౌదరి. ఈ అమ్మడు రెండు అరాకొరా తెలుగు సినిమాల్లో నటించింది కూడా. అయితే బ్రహ్మోత్సవం సినిమాలో ఛాన్సు రావడంతో.. ఒక తెలుగు పిల్లకు బీభత్సమైన ఛాన్సొచ్చిందని తెలుగు ఫ్యాన్స్ సెలబ్రేట్‌ చేసుకున్నారు.  కాని ఎండాఫ్‌ ది డే.. కేవలం ఒక సీన్లో కనిపించి.. వితౌట్‌ ఎనీ డైలాగ్‌.. ఆ తరువాత సంగీత్‌ సాంగులో మెరసి.. మాయమైపోయింది చాందినీ చౌదరి. అదేంటి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇవ్వాల్సిందే అంటూ ఈమె యుట్యూబ్‌ అభిమానులు ఫీలయ్యారట. అసలు ఆ ప్రణీతకు ఇచ్చిన రోల్‌ ఏదో.. ఈ అమ్మాయికి ఇచ్చేసుంటే బాగుండు అనేది చాలామంది అభిప్రాయం. నిన్ననే హీరోయిన్‌ శ్రీదివ్య మాట్లాడుతూ.. 'తెలుగు సినిమాల్లో ఏ ఆఫర్లు రాకపోతే నన్నేం చేయమంటారు. అక్కడ నాకు పలు ఛాలెంజింగ్ పాత్రల్లో నటించమంటూ ఆఫర్స్ వస్తున్నాయి. ఉపయోగించుకుంటున్నా' అనేసింది. ఇప్పుడు చాందిని చౌదరి కూడా అలాగే అంటుందా ఏంటి కొంపతీసి?

ట్యాలెంట్ ఉన్న లోకల్‌ గాళ్స్ ను పట్టించుకోకుండా.. స్కిన్ షో చేసే పరాయి భాషల భామల కోసం టాలీవుడ్ జనాలు ఎగబడుతున్నారని.. చాలామంది భామలు కామెంట్ చేస్తున్న తరుణంలో.. మరి ఈ కొత్త పిల్ల ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News