మహేష్ బాబు సినిమా అన్నారు కాబట్టి బ్రహ్మోత్సవంలో స్పెషల్ క్యారెక్టర్ అంటే చేశాను కాని.. ఇక నుండి అలాంటివి దగ్గరకు కూడా రానివ్వను అంటోంది తెలుగు పిల్ల చాందినీ చౌదరి. యుట్యూబ్ షార్టు ఫిలింస్ తో పాపులర్ అయిన ఈ సుందరి.. ఇప్పడు ''కుందనపు బొమ్మ'' అనే సినిమాతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేసింది.
నిజానికి బ్రహ్మోత్సవం సినిమాలో చిన్న రోల్ ఇచ్చిన కూడా ఎగిరి గంతేసిందట. అయితే కనీసం ఆ రోల్ కు ఒక్క డైలాగ్ కూడా లేకపోవడంతో అప్పట్లో అమ్మడు హర్టు అయ్యిందనే వార్తలొచ్చాయి. అసలు ఆ సినిమాలోనుండి ఈమెను తీసేశారు అనే రూమర్లు కూడా వచ్చాయి కాని.. రిలీజయ్యాక సినిమాలో కనిపించింది కాబట్టి.. బహుశా ఈమె పాత్రను ఏమన్నా తగ్గించారేమో అని అందరూ అనుకున్నారు. ఏదైతేనేం.. అది కేవలం మహేష్ బాబు సినిమా కాబట్టే చేశాను కాని.. ఈసారి మాత్రం ఓన్లీ హీరోయిన్ రోల్స్ అయితేనే చేస్తుందట. ఎవరి సినిమా అయినా కూడా సైడ్ క్యారెక్టర్లు చేయకూడదని ఫిక్సయినట్లు చెప్పుకొచ్చింది.
అయితే తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో తెలుగు అమ్మాయిలను అంతగా ఎంకరేజ్ చేయట్లేదని.. ఆ ధోరణి మాత్రం మారాలని ఆమె అంటోంది. కావాలంటే పాత్రను బట్టి గ్లామరసం చిందించడానికి కూడా తాను రెడీ అని చెబుతున్న ఈ చౌదరి గాళ్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయ వేచి చూడాలి మరి.