మరోసారి ప్రేమమ్ దర్శకుడితో చైతు

Update: 2017-04-08 06:06 GMT
మలయాళ ప్రేమమ్ ను ఎంతో హృద్యంగా తెలుగులోకి తీసుకురావడంలో హీరో నాగచైతన్య- దర్శకుడు చందూ మొండేటి సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ప్రేమమ్ లాంటి క్లాసిక్ ను తెనుగీకరించడంలో దర్శకుడి ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. ప్రేమమ్ వచ్చి ఆరు నెలలు దాటిపోయినా చందూ మొండేటి కొత్త ప్రాజెక్టు ఇంకా ప్రారంభించకపోవడం ఆశ్చర్యకరమే.

ఇప్పుడీ దర్శకుడు కొత్త కథను సిద్ధం చేసేసుకున్నాడని తెలుస్తోంది. మరోసారి నాగచైతన్యతోనే సినిమా చేయనున్నాడట చందూ మొండేటి. ఇప్పటికే చైతుకు స్టోరీ వినిపించగా.. వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. చెయ్ ను ఇప్పటివరకూ ఎవరూ చూపించని కొత్త కోణంలో చూపించబోతున్నాడట ఈ దర్శకుడు. అంతే కాదు.. కథాపరంగా కూడా టాలీవుడ్ లో కనిపించని ఓ కొత్త యాంగిల్ ని పరిచయం చేయనున్నారని టాక్. ముఖ్యంగా స్క్రీన్ ప్లేతో మాయ చేసేందుకు చందూ మొండేటి రెడీ అవుతున్నాడని అంటున్నారు. నిజానికి.. ప్రేమమ్ తర్వాత నాగార్జునతో ఈ డైరెక్టర్ మూవీ ఉంటుందనే టాక్ నడిచింది కానీ.. చైతుకే మొగ్గాడు చందూ.

తనలోని యాక్టింగ్ ట్యాలెంట్ ని చందూ మొండేటి పర్ఫెక్ట్ గా ఆన్ స్క్రీన్ పై చూపగలడని భావిస్తున్నాడట నాగ చైతన్య. అందుకే కొత్త కోణంలో కథ చెప్పగానే ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News