తొలి సినిమా ‘కార్తికేయ’తోనే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయిపోయాడు యువ దర్శకుడు చందూ మొండేటి. ఓ కొత్త దర్శకుడు అలాంటి సాహసోపేత కాన్సెప్ట్ తో సినిమా తీయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టిపికల్ కాన్సెప్ట్ ను చాలా చక్కగా.. ఆసక్తికరంగా చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించాడు చందూ. తొలి సినిమాతో అతను తెచ్చుకున్న గుర్తింపు ప్రకారం చూస్తే.. రెండో సినిమాగా రీమేక్ చేయాల్సి రావడం విచారించాల్సిన విషయమే. కానీ తన అభిమాన కథానాయకుడు అక్కినేని నాగార్జున అడిగేసరికి కాదనలేకపోయాడు. నాగచైతన్య కోసం తాను తయారు చేసిన కథను పక్కనబెట్టి ‘ప్రేమమ్’ను రీమేక్ చేశాడు. నిజానికి ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్స్ ను ముట్టుకోవడం ప్రమాదకరం. ఈ విషయంలో జనాల నుంచి ముందే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ‘ప్రేమమ్’ రీమేక్ చందూకు సవాలుగా నిలిచింది. ఐతే ఆ సవాలును స్వీకరించి తనేంటో రుజువు చేసుకున్నాడు చందూ. రీమేక్ మూవీలో కూడా తన ప్రత్యేకతను చాటుకుని.. రీమేక్ లను మన నేటివిటీకి తగ్గట్లు ఎలా అన్వయించుకుని ప్రేక్షకుల్ని మెప్పించొచ్చో చూపించాడు.
అలా ‘ప్రేమమ్’ ద్వారా చైతూకు ఓ మంచి విజయాన్నందించి.. ఇప్పుడు అతనే హీరోగా తనదైన శైలిలో ఓ సినిమా తీసేందుకు తయారయ్యాడు చందూ. ‘ప్రేమమ్’ ఆబ్లిగేషన్ మీద చేసిన చందూ.. ఇప్పుడు తన శైలికి తగ్గ సినిమా చేస్తున్నాడు. ఇది ‘కార్తికేయ’ తరహాలోనే భిన్నంగా ఉంటుందట. ఐతే ఇందులో యాక్షన్ అంశాలకు పెద్ద పీట వేశారట. మాస్ ఇమేజ్ కోసం గతంలో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన నేపథ్యంలో చైతూ ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. క్లాస్ టచ్ ఉన్న యాక్షన్ సినిమాలతో కెరీర్లో మరో స్థాయికి చేరే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘యుద్ధం శరణం’ చేశాడు. దాని తర్వాత చందూ దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే డిఫరెంట్ యాక్షన్ ఫిలిం చేస్తున్నాడు. ఈ సినిమా ఇటు చైతూ.. అటు చందూ కెరీర్లను డిఫరెంట్ లెవెల్ కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ‘ప్రేమమ్’ తర్వాత పది నెలలు విరామం తీసుకుని ఎంతో పకడ్బందీగా ఈ స్క్రిప్టు రెడీ చేశాడు చందూ. ఇది ‘ప్రేమమ్’కు భిన్నంగా ఉంటూ.. తన ప్రత్యేకతను చాటిచెబుతుందని ఆశిస్తున్నాడు చందూ. ఈ మధ్య వచ్చిన సవ్య సాచి టైటిల్ లోగో కి వచ్చిన హైప్ వేరే దేనికీ రాలేదు.. లోగో లాంచ్ చేసినప్పటినుంచి సోషల్ మీడియా లో మంచిగా ట్రెండ్ అవుతుంది