ప్రేమమ్ మూవీలో హీరో కేరక్టరైజేషన్ లో భాగంగా.. నాగ చైతన్యకు ఎస్ అనే పేరు సెంటిమెంట్. అదే పేరుతో ఉన్న అమ్మాయి చైతుకు భార్యగా వస్తుందని.. తల్లిదండ్రులు చెప్పడంతో అదే నమ్ముతుంటాడు హీరో. అయితే.. రియల్ లైఫ్ లో చైతుకు సమంత భార్య కానుండడంతో.. సామ్ ను ఉద్దేశించే డైరెక్టర్ చందూ మొండేటి ఇలా ఫిక్స్ చేశాడనే వార్తలు వస్తున్నాయి.
దీనిపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. ప్రేమమ్ లో ప్రతీ పాత్రకు ఉన్న పేర్లకు ఓ అర్ధం ఉంటుందని చెప్పాడు. 'మొదట సుమ అనే అమ్మాయితో ప్రేమ. సుమ అంటే పువ్వు.. తొందరగానే ఆ ప్రేమ వాడిపోతుంది. ఆ తర్వాత సితార పాత్ర వస్తుంది. అంటే స్టార్ అని అర్ధం. ఎంత బాగున్నా నక్షత్రాలు అందవు. ఇక చివరగా సింధు. ఎప్పుడూ నుదుటనే అంటి పెట్టుకుని ఉండే సింధూరం. అలాగే హీరో పేరు విక్రమ్. అంటే పట్టువదలకుండా విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే ఆ పాత్రలకు ఆ పేర్లు పెట్టాను' అంటూ వివరించాడు చందూ మొండేటి.
రియల్ లైఫ్ ను ఉద్దేశించి పేర్లు పెట్టడం కానీ.. డైలాగ్స్ రాయడం కానీ చేయలేదని చెప్పిన ఈ దర్శకుడు.. హోటల్ కు ఎస్ స్టార్ అనే పేరు అంటే.. సితార అని అర్ధం అంటూ వివరించాడు. గతేడాది సెప్టెంబర్ లోనే డైలాగ్స్ రాసుకున్నానని.. సమంతను ఉద్దేశించి ఎస్ సెంటిమెంట్ ను జోడించలేదంటూ డీటైల్డ్ గా చెప్పాడు చందూ మొండేటి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/