రిజల్ట్ చూసి క్లారిటీకి వస్తా

Update: 2018-10-30 06:16 GMT
యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి `కార్తికేయ‌` - `ప్రేమ‌మ్` హిట్ల‌తో  ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కొత్త ప్రాజెక్ట్ ఆల‌స్యంగా ప్రారంభించిన‌ప్ప‌టికీ ఆ జోష్ ను ఏ మాత్రం మిస్ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య తో తెర‌కెక్కించిన `స‌వ్య‌సాచి` రిలీజ్ కు రెడీ అయింది. సినిమా కాస్త ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ బ‌జ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ యూ ట్యూబ్ లో సంచ‌ల‌న సృష్టించింది. దీంతో ఎక్స్ ప‌క్టేష‌న్స్ స్కైని ట‌చ్ చేస్తున్నాయి. చందు మార్క్  థాట్ ని క‌మ‌ర్శిలైజ్ చేసి తెర‌కెక్కించిన సినిమా అనే టాక్ వినిపిస్తోంది. చై సైతం ప్రాజెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తాజాగా `స‌వ్య‌సాచి`  ప్ర‌మోష‌న్ లో భాగంగా చందు త‌ర్వాతి ప్రాజెక్ట్ ల‌పై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. నాగార్జున కోసం ఓ స్ర్కిప్ట్ రెడీ చేసాను.

కానీ ఇంకా దానిపై స‌రైన క్లారిటీ లేదు. `స‌వ్య‌సాచి` రిజ‌ల్ట్ పైనే అది అధార‌ప‌డి ఉంటుంద‌నుకుంటున్నా.  ప్రేమ‌మ్ కంటే ముందు నాగ‌చైత‌న్య‌కు చాణ‌క్య అనే టైటిల్ తో ఓ క‌థ చెప్పా. చాలా ఎగ్జైట్ గా ఉంటుంది. కానీ స‌వ్వ‌సాచి చైతో చేసాను కాబ‌ట్టి ఇక ఆ క‌థ వేరే హీరోతో చేయాల్సి ఉంటుందేమో. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ఇంకా  నేను కూడా డిసైడ్ అవ్వ‌లేదు. అలాగే నిఖిల్ కార్తికేయ‌-2 చేద్దామ‌ని చంటేస్తున్నాడు. కానీ నాద‌గ్గ‌ర 15 నిమిషాల క‌థే ఉంది. పూర్తి క‌థ సిద్దం చేయాలంటే స‌మ‌యం ప‌డుతుంది. నేను కూడా ఇంకా ఎదిగిన త‌ర్వాత ఆ సినిమా చేయాల‌నుకుంటున్నా. ప్ర‌స్తుతానికి ఆ థాట్ నా బ్రెయిన్ లో అలాగే ఉంద‌న్నాడు. అలాగే  ఏ హీరోకి ఇప్ప‌టివ‌ర‌కూ  క‌థ‌లు వినిపించ‌లేదుట‌.

స‌వ్య‌సాచి విడుద‌ల త‌ర్వాత కొత్త సినిమాపై దృష్టి పెడ‌తాన‌న్నాడు. అయితే ఏ హీరోతో సినిమా చేసినా త‌న  సొంత క‌థ‌ల‌తోనే సినిమాలు చేస్తాన‌న‌న్నాడు. రీమేక్ క‌థ‌ల‌ను మాత్రం అస్స‌లు ట‌చ్ చేయ‌న‌ని  తెలిపాడు. `స‌వ్య‌సాచి`  రిజ‌ల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నా...రిలీజ్ అంటే సాధార‌ణంగా అంద‌రి డైరెక్ట‌ర్ల‌కి ఉండే టెన్ష‌న్ త‌న‌కి ఉంద‌న్నాడు. 
Tags:    

Similar News