చందూ మొండేటి.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతున్న పేరు. ‘కార్తికేయ’ సినిమాతో ఈ యువ దర్శకుడు ఎంతటి సంచలనం రేపాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఒక రీమేక్ మూవీతోనూ అతడి పేరు మార్మోగిపోతోంది. రీమేక్ అనగానే కాపీ పేస్ట్ వ్యవహారం లాగా చేయకుండా ‘ప్రేమమ్’ మాతృకలోని సోల్ మిస్ కాకుండా.. దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మలిచి తన ముద్రను చూపించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలోని లేడీ క్యారెక్టర్లను అతను డీల్ చేసిన విధానం కూడా అందరినీ మెప్పించింది. ఈ నేపథ్యంలో మీడియాకు మోస్ట్ వాంటెడ్ అయిపోయిన చందూ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతను తన భార్య గురించి.. మొత్తంగా ఆడవాళ్ల గురించి చెప్పిన గొప్ప మాటలేంటో చూద్దాం పదండి.
‘‘నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎన్నో రెట్లు పెరిగింది మా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలోనే. అప్పట్లో ప్రెగ్నెన్సీ గురించి ఒక పెద్ద పుస్తకం చదివాను. అది చదివాక నేను ఒక గైనకాలజిస్ట్ కంటే ఎక్కువ జ్నానం సంపాదించాను. ఒక బిడ్డ పరిణామం చెందే క్రమం అంతా నాకు తెలుసు. ఒంట్లోని ప్రతి కణం ఎలా ఏర్పడుతుందో.. ఎలా పెరుగుతుందో నాకు అర్థమైంది. మనం కడుపులో ఒక చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లిపోతాం. అలాంటిది ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్లు ఎన్ని బాధలు పడతారో నాకు అప్పుడు అర్థమైంది. అందుకే ఈ ఒక్క విషయానికే ఆడవాళ్లను ఎంతో గొప్పగా భావించాలి. వాళ్లకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఆ టైంలోనే నా భార్య మీద.. అలాగే మా అమ్మ మీద గౌరవం.. ప్రేమ ఎన్నో రెట్లు పెరిగాయి. నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు కూడా జాబ్ చేసింది. 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్ కు వెళ్లి వచ్చింది. అందుకే ఆమె రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఐ వో టు హర్’’ అని చాలా ఉద్వేగంగా చెప్పాడు చందూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/