అప్పట్లో ఒకడుండేవాడు మూవీతో నారా రోహిత్ మంచి హిట్ నే కొట్టగలిగాడు. కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్న తీరు చూస్తే.. కచ్చితంగా హిట్ జాబితాలో ఈ మూవీ చేరడం ఖాయం అంటున్నారు. మరోవైపు శ్రీవిష్ణు కేరక్టర్ కి కూడా బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. అందరికంటే ఎక్కువగా ఈ మూవీతో పేరు సంపాదించుకున్నది మాత్రం దర్శకుడు సాగర్ కె. చంద్ర.
అప్పట్లో ఒకడుండేవాడు మూవీ రిలీజ్ వరకూ ఇతడిని ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఆ మూవీలో దర్శకుడు చూపించిన బ్రిలియన్స్.. టెక్నికల్ వాల్యూస్ కి ప్రొడ్యూసర్స్ ఫ్లాట్ అయిపోయారట. మీడియం రేంజ్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్ నుంచి భారీ నిర్మాతల వరకూ సాగర్ తో సినిమా తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ టాప్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఇతనికి పలు మార్లు కాల్స్ వెళ్లడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇప్పటివరకూ కేవలం సూపర్ స్టార్ రేంజ్ హీరోలతోనే సినిమాలు తీసిన ఓ ప్రొడక్షన్ కంపెనీ అయితే.. సాగర్ కె చంద్ర-రోహిత్ కాంబినేషన్ లో మంచి బడ్జెట్ తో ఓ మూవీ చేసేందుకు సిద్ధం అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆఫర్స్ ఇంకా ఉన్నాయ్ కానీ.. ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు సాగర్ కె. చంద్ర. ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నాడట. అవన్నీ ఓ ఫార్మాట్ కి వచ్చాక నిర్మాతలను కలిసే యోచనలో ఉన్నాడట ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/