చంద్రశేఖర్ యేలేటి ‘ఐతే’ దగ్గర్నుంచి అన్నీ మంచి సినిమాలే తీశాడు. కానీ అతడి కెరీర్ లో ఇప్పటిదాకా పెద్ద కమర్షియల్ సక్సెస్ లేదు. ఐతే.. అనుకోకుండా ఒక రోజు లాభాలు తెచ్చిపెట్టాయి కానీ.. కమర్షియల్ సినిమాల తరహాలో భారీ వసూళ్లయితే సాధించలేదు. వీటి తర్వాత చేసిన ఒక్కడున్నాడు.. ప్రయాణం.. సాహసం సినిమాలు కొంత వరకు నష్టాలే తెచ్చిపెట్టాయి. కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోకపోవడం.. స్టార్లతో పని చేయకపోవడం వల్ల యేలేటి ఎప్పుడూ డేంజర్ జోన్లోనే ఉంటున్నాడు. మంచి స్క్రిప్టులు తయారు చేస్తే సరిపోదు.. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడం.. తన సినిమాలకు హైప్ తీసుకురావడం.. మార్కెట్ చేసుకోవడం నేర్చుకోవాలి యేలేటి. ఈ విషయంలో యేలేటిలో కొంత మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది.
‘మనమంతా’ సినిమాకు అతడు ఎంచుకున్న కాస్టింగ్ సూపర్బ్ అనే చెప్పాలి. మోహన్ లాల్ లాంటి సౌత్ అంతా తెలిసిన స్టార్ ను హీరోగా ఎంచుకోవడం మంచి ఆలోచన. గౌతమి కూడా బహుభాషా నటే కావడం కలిసొచ్చే అంశం. దీని వల్ల సినిమా రీచ్ పెరిగింది. మలయాళం.. తమిళంలోనూ భారీగా సినిమాను రిలీజ్ చేసే అవకాశం దక్కింది. ‘మనమంతా’ సినిమాకు తెలుగులో కంటే కూడా మలయాళంలో మంచి క్రేజ్ వచ్చింది. దీనికి అక్కడ ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చే అవకాశముంది. మోహన్ లాల్ వైవిధ్యమైన కంటెంట్ తో ‘దృశ్యం’ సినిమా చేశాడు. అది మలయాళంలో భీభత్సమైన హిట్టయింది. ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది.
‘మనమంతా’కు మంచి టాక్ వస్తే ఇది కూడా పెద్ద హిట్టయ్యే అవకాశముంది. ఈ చిత్రాన్ని మలయాళంలో ‘విస్మయం’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. మోహన్ లాల్ తమిళ ప్రేక్షకులకూ బాగానే పరిచయం. పైగా గౌతమి కూడా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని అక్కడ కూడా ‘నమదు’ పేరుతో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ‘మనమంతా’ సినిమా మూడు భాషల్లో పెద్ద స్థాయిలోనే విడుదలవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే యేలేటి కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూద్దాం.. యేలేటి ట్రిపుల్ ధమాకా ఏమవుతుందో?