టాలీవుడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి సినిమాలంటే ప్రేక్షకులలో ఓ మాదిరి అంచనాలు నెలకొంటాయి. ఎందుకంటే ఆయన సినిమాలలో కనిపించే స్క్రీన్ ప్లే మ్యాజిక్ అది. ఐతే సినిమాతో దర్శకుడుగా మారిన ఏలేటి.. ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రాబట్టి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ సినిమాతో ఓకే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ వచ్చాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండో సినిమా 'అనుకోకుండా ఒకరోజు' సినిమాతో మరో సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డు అందుకున్నాడు. కానీ తర్వాత నుండే మొదలైంది. సినిమాలలో ఏలేటి మార్క్ కనిపించినప్పటికి సినిమాలు బోల్తా కొడుతూ వచ్చాయి. ఇప్పటివరకు ఏలేటి తీసింది ఏడు సినిమాలే కావడం గమనార్హం.
అంటే సినిమా సినిమాకు ఆయన చాలా గ్యాప్ తీసుకుంటాడు. కానీ డిఫరెంట్ స్టోరీతోనే వస్తాడు. ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం ఇలా వరుసగా ప్లాప్ అవుతూనే ఉన్నాయి. కానీ 2016లో మనమంతా అనే సినిమా రూపొందించి మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అనిపించాడు ఏలేటి. కానీ అప్పటినుండి ఆయన నుండి మరో సినిమా రావడానికి ఐదేళ్లు పట్టింది. అంటే 2021లో ఏలేటి నుండి చెక్ సినిమా వచ్చింది. ఈ సినిమా టీజర్ తోనే ప్రేక్షకులకు ఆసక్తిరేపింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చేసరికి ఫలితం తేలిపోయింది. మళ్లీ ఇప్పుడు ఏలేటి నుండి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆయన మరో సినిమా ప్రకటిస్తారో లేదో తెలియదు. కానీ ఏలేటి మేకింగ్ కి, స్క్రీన్ ప్లేకి బడా దర్శకులలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి మరి చెక్ మూవీ టైంలో మైత్రి మూవీస్ వారితో ఓ ఒప్పందం కుదిరిందట. మరి చెక్ సినిమా పోయింది కాబట్టి ఒప్పందం ముందుకెళ్తుందా లేదా తెలియాల్సి ఉంది.