సామాజిక సందేశంతో తెరకెక్కిన శ్రీమంతుడు బాక్స్ ఫీస్ లో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్.. మాస్ అన్న తేడా లేకుండా ఈ సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టటమే కాదు.. సినిమాలో ప్రధానమైన గ్రామదత్తత అంశం పలువుర్ని ఆకర్షిస్తోంది.
ఊహించిన దాని కంటే మిన్నగా సినిమా సక్సెస్ కావటంపై మహేష్ ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాజిక కథాంశంతో రూపొందించిన ఈ సినిమాను తెలంగాణ పంచాయితీ శాఖామంత్రి కేటీఆర్ కోసం ప్రత్యేక షో వేయనున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు కానీ సినిమా నచ్చితే.. వెనువెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాను చూస్తారని చెబుతున్నారు. ఊరిని దత్తత తీసుకునే కథాంశం పలువుర్ని ఆకర్షించటమే కాదు.. ప్రదాని మోడీ సైతం.. గ్రామీణ వికాసం మీద ప్రత్యేక దృష్టి సారించటం.. గ్రామాల్ని దత్తత తీసుకునే కార్యక్రమం నిర్వహించటం తెలిసిందే.
ఇక.. శ్రీమంతుడి చిత్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రెండో వారంలో చూడనున్నట్లు చెబుతున్నారు. ఆయన కోసం ప్రత్యేక షో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీకి కూడా ఈ సినిమా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో సినిమా యూనిట్ ఉందంటున్నారు. మోడీ విషయంపై స్పష్టత లేనప్పటికీ.. ఇద్దరు చంద్రుళ్లు మాత్రం.. శ్రీమంతుడు సినిమాను చూసే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.