ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక్కో పాత్ర గుట్టు రట్టవుతూ నెటిజనుల్లో అంతకంతకు ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి వ్యక్తిగత జీవితంలో - సినీ - రాజకీయ జీవితంలో అనుబంధం కలిగి ఉన్న వారి పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారు? తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానులు - కామన్ జనాలతోపాటు అందరిలోనూ ఉంది. ఆ క్రమంలోనే ఫలానా పాత్రలో ఫలానా నటి లేదా నటుడు ఎంపికయ్యారంటూ ముందస్తు ఊహాగానాలు సాగుతున్నాయి.
ఎన్టీఆర్ సతీమణి.. బాలకృష్ణ తల్లిగారైన బసవతారకం పాత్రలో బాలీవుడ్ మేటి కథానాయిక విద్యాబాలన్ నటిస్తున్నారు. అలానే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ అభినయించనుందని తెలుస్తోంది. స్వస్థలం నిమ్మకూరులో ఎన్టీఆర్ బాలకుడిగా వేసిన చిలిపి వేషాలకు గానూ మోక్షజ్ఞను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో పాటు పలు పాత్రలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
అయితే బయటకు తెలిసిన పాత్రల మాటేమో కానీ - అసలు రహస్యంగా దాచేస్తున్న పాత్రల సంగతేంటి? అంటూ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రైవల్ కం వెన్నుపోటుదారుగా చెప్పుకునే నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో ఎవరు నటిస్తున్నారు? ఎన్టీఆర్ కు హిందీ డబ్బింగు చెప్పిన యార్లగడ్డ పాత్రధారి ఎవరు? అలానే హిందీలో ఎన్టీఆర్ గా నటించిన ఉపేంద్ర పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఇలా వేనవేల ప్రశ్నలెన్నో. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ పాత్ర ఉండాలి? ఏ పాత్ర పరిమితమవ్వాలి? ఏ పాత్ర కనిపించకూడదు? అన్నవి ఏపీ సీఎం చంద్రబాబు ఆరాతీస్తూ.. అవసరం మేర నియంత్రిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ముందే దర్శకుడు క్రిష్ కి చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. ప్రతి పాత్రకు సంబంధించిన డీటెయిలింగ్ పై మంతనాలు సాగించారు. ఆ క్రమంలోనే ఫలానా పాత్రధారిని తగ్గించాలని - ఫలానా పాత్రను పెంచాలని సూచించారట. ఇక ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రోల్ ప్రధానంగా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ చైతన్య రధయాత్రకు డ్రైవర్ గా ఉన్న హరికృష్ణ పాత్రను పరిమితం చేయమని బాబు సూచించారట. ఆ క్రమంలోనే క్రిష్ ని బాబు మ్యానిప్యులేట్ చేశారా? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమా ప్రథమార్థం మొత్తం ఎన్టీఆర్ సినీ కెరీర్ ని చూపిస్తారు. ద్వితీయార్థంలో మాత్రమే అతడి రాజకీయ జీవితాన్ని చూపిస్తారట.