1000 డేస్ పైనే ఆడుతుంది -సిఎం చంద్రబాబు

Update: 2016-12-26 17:47 GMT
''నాకు ఏ మాత్రం అనుమానం లేదు.. బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఖచ్చితంగా 100 రోజులపైగా పరిగెడుతుంది. లెజెండ్ సినిమా.. బోయపాటి శ్రీనివాస్ తీసిన సినిమా.. మన దక్షిణ భారతదేశంలో 1000 డేస్ ఆడిన ఒకే ఒక్క సినిమా. ఆ పిక్చరే వెయ్యి రోజులు ఆడిందంటే.. మన చరిత్రను పూర్వ వైభవంను చెప్పే సినిమా కాబట్టి.. ఇది అంతకంటే ఎక్కువ రోజులు ఆడుతుంది'' అన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ సిఎం చంద్రబాబు.

''100వ సినిమా చేయడానికి చాలా కథలను విన్న బాలకృష్ణ.. క్రిష్‌ గారు చెప్పిన ఈ కథను తీసుకోవడం గొప్ప విషయం. తెలుగు వారి చరిత్రను చెప్పే ఈ సినిమా కథ అమరావతి చుట్టూ తిరుగుతుంది. కరక్టుగా ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరిగిన.. మన కొత్త రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం.. మళ్ళీ తెలుగు వారి ఫ్యూచర్ ను అమరావతి నుండి మొదలెట్టడం.. అదే సమయంలో శాతకర్ణి సినిమా చేయడం పెద్ద విషయమే'' అంటూ బాలయ్యను అభినందించారు.

''లండన్ నగరంలో కూడా అమరావతి గ్యాలరీ ఉంది. ఒకప్పుడు అమరావతి రాజధానిగా విదేశాలకు ఎన్నో ఎగుమతులు చేశారు. లాజిస్టిక్స్ హబ్ గా ఉంది. ఆ హిస్టరీని చెప్పాలని అమరావతి గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు లండన్ అధికారులు చెప్పారు. నేను ఆ గ్యాలరీని మాకు ఇచ్చేయాలని ఎక్కడ అడుగుతానోనని వారు ఖంగారు పడ్డారు'' అంటూ అమరావాతి గొప్పతనం గురించి చంద్రబాబు తెలిపారు. తెలుగువారందూ అమరావతిపై సినిమా తీస్తున్న క్రిష్ ను అభినందించాలని అన్నారాయన.

తెలుగు చరిత్రను ప్రపంచానికి చెప్పిన శాతకర్ణి.. అమరావతి నుండి దేశాన్ని పాలించడం.. ఆ కథను బాలకృష్ణ-క్రిష్‌ లు అందరికీ చెప్పడం గర్వకారణం అన్నారు. ఇకపోతే ఆనాడు ఆయన శాతకర్ణి అయితే.. కొత్త తరానికి లెజండరీ ఎన్టీఆర్ కూడా ఒక శాతకర్ణి అన్నారు.
Tags:    

Similar News