ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టెక్ సీఎం అనే పేరున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత అందులోనూ తన ప్రత్యేకతను చంద్రబాబు చాటుకుంటున్నారు. ఫిప్త్ ఎస్టేట్ గా పేరు దక్కించుకున్న సోషల్ మీడియాలో బాబు చురుకైన స్పందన తాజాగా అల్లు వారబ్బాయి అల్లూ శిరీష్ కు భలే నచ్చేసింది. జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమావేశం గురించి శిరీష్ ట్వీట్ చేయగా దానికి అనూహ్య రిప్లై వచ్చింది.
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హార్వర్డ్ వైద్యులతో కలిసి క్షేత్రస్థాయిలో తాను చేసిన అధ్యయనం, అక్కడి సమస్యలు వంటివి పవన్ చర్చించారు. తగు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బాబుకు అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.
``ప్రజా సమస్యల విషయంలో ఉత్తమ నాయకులు కీలక చర్చలు జరిపి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం అభినందనీయం. దేశం ప్రయోజనాలు ముఖ్యం`` అని శిరిష్ ట్వీట్ చేశారు. దీనికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ `మీ స్పందనకు ధన్యవాదాలు అల్లూశిరిష్. మాకు అత్యంత ముఖ్యమైనది ప్రజల సంక్షేమం. ప్రజలకు సేవ చేయడమనే ప్రథమ కర్తవ్యమనే మా విధానాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకుపోతాం`` అని సీఎం చంద్రబాబు రీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా శిరీష్ ``థ్యాంక్యూ సర్. గౌరవిస్తున్నాం`` అని అన్నారు.