నకిలీ కరెన్సీపై చంద్రబోస్ ట్వీట్...వైరల్

Update: 2020-02-26 15:35 GMT
అది భారతీయ కరెన్సీ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్....అందులో పని చేసే వ్యక్తి చాలా బిజీగా నోట్ల కట్టలను పేర్చే పనిలో నిమగ్నమై ఉన్నాడు....అతడి చుట్టూ రకరకాల డినామినేషన్లలోని నోట్ల కట్టలు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి....50 రూపాయల నోట్లు - 200 రూపాయల నోట్లను జాగ్రత్తగా కట్టలు కడుతూ ఆ వ్యక్తి సీరియస్ గా పనిచేసుకుంటున్నాడు. ఇదంతా రిజర్వ్ బ్యాంకులోని ప్రింటింగ్ కార్యాలయాల్లో జరిగేదేనని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అవి అసలు ఒరిజినల్ కరెన్సీ నోట్లే కాదు...ఆ మాట కొస్తే అది భారత్ లోని ప్రింటింగ్ ప్రెస్ అసలు కాదు. ఇదంతా మన దాయాది దేశం పాక్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న `నకిలీ` వ్యవహారం. తాజాగా, ఆ నకిలీ నోట్లు ముద్రించే వీడియోను ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇదంతా బ్రతుకుదెరువు కోసం పాక్ లోని ఓ కుటీర పరిశ్రమలో జరుగుతోన్న వ్యవహారం అంటూ సెటైరికల్ క్యాప్షన్ పెట్టారు.

ఆ వీడియోపై చంద్రబోస్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది పాక్ లోని చిన్న తరహా పరిశ్రమ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. నకిలీ కరెన్సీని కూడా ఓ కుటీర పరిశ్రమ అంటూ పోల్చిన చంద్రబోస్ సాహిత్య వ్యంగ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. పెళపెళలాడే కొత్త నోట్లను అసలైన నోట్లకు దీటుగా ముద్రిస్తున్న వైనం చూసి అవాక్కవుతున్నారు. ఈ టాలెంట్ ను సక్రమమైన మార్గంలో ఉపయోగిస్తే పాక్ ఎప్పుడో బాగుపడేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను దర్శకుడు హరీశ్ శంకర్ కూడా లైక్ చేయడం విశేషం.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News