టాలీవుడ్ లో విలక్షణమైన శైలి కలిగిన అతికొద్ది దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. హీరోని బట్టి కాక కథలను బట్టి ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని సరికొత్త తరహా స్క్రీన్ ప్లే తో మెప్పించడం ఆయనకే చెల్లింది. మొదటి సినిమా ఐతే తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన చంద్రశేఖర్ యేలేటి ఇప్పటిదాకా తన బాణీకే కట్టుబడి ఉన్నారు. ఆ మధ్య మోహన్ లాల్ తో చేసిన మనమంతా మంచి పేరు తీసుకొచ్చింది కాని కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అప్పటినుంచి కొంత గ్యాప్ తీసుకున్న యేలేటి ముగ్గురు నలుగురు హీరోలతో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సాయి ధరం తేజ్ తో చిత్రలహరి కన్నా ముందే ఓ సినిమా ఉంటుందని అప్పట్లోనే టాక్ వచ్చింది. అది కార్యరూపం దాల్చలేదు. ఒక్కడున్నాడు-సాహసం చేసిన ఎక్స్ పీరియన్స్ తో గోపిచంద్ మరో ఛాన్స్ ఇస్తాడనే న్యూస్ తెలిసినా అదీ ముందుకు సాగలేదు. నితిన్ ఎస్ చెప్పాడు కాని తనకున్న కమిట్ మెంట్స్ పూర్తి చేయడానికి ఇంకో రెండేళ్ళు పట్టేలా ఉంది
ఈ నేపధ్యంలో ఇంత వెయిటింగ్ చేయడం ఎందుకని భావించిన చంద్రశేఖర్ యేలేటి ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు తో కొత్త సినిమా చేయబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. దీనికి శ్రేయను సంప్రదిస్తే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఓకే చెప్పిందని టాక్. చంద్రశేఖర్ గతంలో ఛార్మీతో చేసిన అనుకోకుండా ఒక రోజు సూపర్ హిట్ అయ్యింది. ఊహకందని కథా కథనాలతో హీరొయిన్ పాత్రను హై లైట్ చేస్తూ సమాజంలోని ఓ సున్నితమైన సమస్యను స్పృశించిన తీరుకు వసూళ్లు కూడా బాగా వచ్చాయి. అదే తరహాలో శ్రేయాతో అంతకుమించిన ట్రీట్మెంట్ తో కొత్త కథ రాసుకున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు. సృజనాత్మక దర్శకులకు ఇలాంటి మార్పులు చేర్పులు సహజమే కాని ఇలా హీరో బదులు హీరొయిన్ బేస్డ్ కథకు మారడం మాత్రం కొత్తే